కాల జ్ఞానంలో బ్రహ్మంగారు భూమిపై అధర్మం హెచ్చినప్పుడు వీరభోగ వసంత రాయలుగా అవతరిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి టైటిల్‌తో సినిమా ... అందులో విలక్షణమైన సినిమాలు చేసే నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు, శ్రియా శరన్ వంటివారు నటించడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ వీర భోగ వసంత రాయలు ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం...
కథ:
సిటీలో అనాథలు, పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలు కిడ్నాప్‌కు గురవుతుంటారు. మరోవైపు శ్రీలంకకు బయలుదేరిన విమానం కనపడకుండా పోతుంది. మరో వైపు దేశంలో చిచ్చు రేపడానికి మారణాయుధాలను సరఫరా చేసే ముఠా.. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు జరుగుతుంటాయి. ఇలాంటి తరుణంలో కనపడకుండా పోయిన విమానాన్ని తానే హైజాక్ చేశానని.. తన పేరు వీరభోగ వసంతరాయలు అని నిఖిల్(శ్రీవిష్ణు).. దీపక్ రెడ్డి(నారా రోహిత్), నీలిమ(శ్రియా ఫోన్ చేస్తాడు. మరో పక్క తమ అనాథ ఆశ్రమంలో చిన్న అమ్మాయి కనపడకుండా పోయిందని డాక్టర్(రవిప్రకాశ్) పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అలాగే ఇన్‌స్పెక్టర్(సుధీర్‌బాబు)కి తన ఇల్లు కనపడకుండా పోయిందని ఓ చిన్న అబ్బాయి కంప్లైంట్ చేస్తాడు. అసలు ఈ ముగ్గురికీ సంబంధం ఏంటి? అసలు ఈ వీరభోగ వసంత రాయలు ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
సినిమా ప్రధానంగా నాలుగు ప్రాతధారులు నారారోహిత్, సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, శ్రియ మధ్యనే నడుస్తుంది. మిగిలిన పాత్రధారులందరూ సపోర్టివ్‌గా కనపడతారు. నటీనటులు గురించి మనం తప్పు చెప్పనక్కర్లేదు. వారేం కొత్తవారు కారు.. కొత్తగా నిరూపించుకోనవసరం కూడా లేదు. పాత్రధారులు పాత్రల పరిధుల మేర చక్కగా నటించారు. ముఖ్యంగా శ్రీవిష్ణు ఇప్పటి వరకు కనిపించిన పాత్రలకు డిఫరెంట్‌గా ఈ సినిమాలో కనిపించాడు. ఓ పాయింట్‌ను నెరేషన్ ఆధారంగా దర్శకుడు ఆసక్తికరంగా మలచాలనుకున్నాడు. ముఖ్యంగా ప్రథమార్థంలో కాసేపు కథ ఆసక్తికరంగానే సాగుతుంది. తర్వాత కన్‌ఫ్యూజింగ్ ఎక్కువ అవుతుంది. దర్శకుడు ఇంద్రసేన తాను ఎంచుకున్న పాయింట్‌కు తిరుగులేదని అనుకున్నాడో ఏమో.. లాజిక్స్ గురించి ఆలోచించుకుండా సినిమమాను తెరకెక్కించేశాడు. నేపథ్య సంగీతం, పాటలు ఇవన్నీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి చాలా దూరంగా సినిమా ఉంది. సినిమాటోగ్రఫీ బాగా ఉంది. అసలు విమానాలు, అమ్మాయిలు కిడ్నాప్. మారణాయుధాలు సరఫరా.. వీటికి వీరభోగ వసంత రాయలకు ఉన్న సంబంధం ఏంటనేది దాన్ని దర్శకుడు సరిగ్గా పొట్రేట్ చేయలేకపోయాడు. ఇంత మంచి నటీనటులున్ప సినిమా ఎలాగో ఉంటుందనుకుంటే ప్రేక్షకుడి సహానానికి పరీక్ష పెట్టేలా సినిమా ఉంది. మొత్తానికి ఆసక్తికరంగా లేని థ్రిల్లర్‌గా సినిమా ఉంది.
బోటమ్ లైన్: వీర భోగ వసంత రాయలు కాస్త... వీర బోరు వసం రాయలు అయ్యింది
Comments