'వీడికి దూకుడెక్కువ' ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీకాంత్-కామ్మ జెత్మలాని జంటగా రూపొందుతున్న వీడికి దూకుడెక్కువ` చిత్రం ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా విడుదలైంది. చక్రి సంగీత సారధ్యం వహించిన చివరి చిత్రమిది. ముఖ్య అతిధి గా విచ్చేసిన తెలంగాణ రవాణ శాఖామాత్యులు పి.మహేంద్రరెడ్డి ఆడియో ఆవిష్కరించి.. స్వర్గీయ చక్రి సతీమణి శ్రీమతి శ్రావణికి తొలి ప్రతిని అందించారు. శ్రీమతి బి.సుధారెడ్డి సమర్పణలో.. పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వం వహిస్తున్నారు. హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ ఆడియో వేడుకలో చిత్ర కథానాయకుడు శ్రీకాంత్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాుపంచుకొన్నారు.
చక్రి సతీమణి శ్రీమతి శ్రావణిని శాలువాతో సత్కరించిన అనంతరం ఆడియో ఆవిష్కరించిన మంత్రి మహేంద్రరెడ్డి.. హీరో శ్రీకాంత్ తనకు చిరకాల మిత్రుడని, అతని మంచితనం గురించి తనకు బాగా తెలుసని.. ఆయన నటించిన వీడికి దూకుడెక్కువ` చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి.. తమ హీరో శ్రీకాంత్ సహాయసహకారాల వల్ల వీడికి దూకుడెక్కువ` చిత్రం అద్భుతంగా రూపొందిందని.. శ్రీకాంత్ కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలుస్తుందనే నమ్మకం తమకుందని అన్నారు.
ఇంత మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత రామకృష్ణారెడ్డి, హీరో శ్రీకాంత్‌కు దర్శకుడు సత్యనారాయణ ద్వారపూడి కృతజ్ఞతలు తెలిపారు. చక్రి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. రామకృష్ణారెడ్డిగారి లాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరమని.. అందరూ ఎంతో ప్యాషన్‌తో, పట్టుదలతో రూపొందించిన వీడికి దూకుడెక్కువ` కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కెమెరామెన్ సురేందర్‌రెడ్డి, పాటల రచయితలు భాస్కరభట్ల, కందికొండ, చిర్రావూరి విజయ్‌కుమార్, గాయనీగాయకులు కౌసల్య , భార్గవి పిళ్లై, సింహా, వేణు, రేవంత్లతోపాటు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, పారిశ్రామికవేత్తలు రాంగోపాల్ రెడ్డి , చేకూరి సూర్యనారాయణరాజులతో పాటు .. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్ శ్రీను, చిత్రం శ్రీను, అశోక్‌కుమార్, కొల్లు శివ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments