'వీడికి దూకుడెక్కువ' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
వంద చిత్రాలకు పైగా నటించిన శ్రీకాంత్ నటించిన వీడికి దూకుడెక్కువ. బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మాత సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర అలరించిందో తెలుసుకోవాలంటే సినిమా సమీక్షలోకి వెళదాం.
కథ-
నిజాయితీ, దూకుడు గల పోలీస్ ఆఫీసర్ క్రాంతి(శ్రీకాంత్). తనదైన శైలిలో దూకుడుగా విలన్స్ భరతం పడుతుంటాడు. కథ ఇలా జరుగుతుండగా క్రాంతి చిన్ననాటి స్నేహితురాలు చాముండేశ్వరి (కామ్నజెఠ్మలాని)తో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే దేవాలయాలపై రీసెర్చ్ కోసం మలేషియా వెళ్ళిన చాముండేశ్వరిని అక్కడా హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా కిడ్నాప్ చేస్తుంది. అప్పుడు క్రాంతి ఏం చేశాడు? చాముండేశ్వరిని ఎలా కాపాడాడనేదే సినిమా.
సమీక్ష-
ఇలాంటి పాత్రలను ఎన్నింటినో చేసిన శ్రీకాంత్ సులవుగా ఈ పాత్రను చేసేశాడు. సినిమాను ఒక్కడిగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. కామ్నజెఠ్మలానీ తన పాత్రకు న్యాయం చేసింది. చంద్రమోహన్, కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ మధ్య వచ్చే కామెడి సన్నివేశాలు బావున్నాయి. అజయ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. అయితే దర్శకుడు సత్యనారాయణ కొత్తగా చెప్పిందేమీ లేదు. రొటీన్ కమర్షియల్ పార్మెట్స్తో సినిమాను తెరకెక్కించాడు. అనవసర సీన్స్ ఉండటం వల్ల ప్రేక్షకుడు అసహనంగా ఫీలవుతాడు. సినిమాలో శ్రీకాంత్ షేడ్స్ దూకుడులో మహేష్‌ను పోలి ఉంటాయి. సెకండాఫ్‌లో మలేషియా పార్ట్ లాగింగ్ అనిపిస్తుంది. సురేందర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. చక్రి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. ఎడిటింగ్ అసలు బాగాలేదు. చాలా వరకు సీన్స్‌ను తొలగించేసి ఉండవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.
విశ్లేషణ-
శ్రీకాంత్ వంటి సీనియర్ హీరో, మంచి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు సినిమాను కొత్తగా ప్రెజెంట్ చేయాలనే ఆలోచన రాకుండా దర్శకుడు రొటీన్ కథ, కథనాలతో ప్రేక్షకులను విసుగెత్తించాడు. సినిమాను సాగదీయాలనుకుంటేనే ప్రేక్షకుడికి పరీక్ష పెడుతున్నట్లు. ఆ విషయాన్ని దర్శకుడు మరచిపోయినట్లున్నాడు. శ్రీకాంత్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. సినిమాటోగ్రఫీ, సంగీతం బావున్నా గుర్తింపు లేకుండా పోయింది. మొత్తం మీద దూకుడు తగ్గిపోయింది..
బాటమ్ లైన్- వీడికి దూకుడు...తగ్గింది..
రేటింగ్-2.25/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments