Veedevadu Review
వ్యాపారవేత్త అయిన సచిన్‌జోషి సినిమా రంగంలో కూడా రాణించాలని గత పదిహేనేళ్లుగా తన వంతు ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాడు. అయితే సచిన్ ఖాతాలో ఓ మంచి సక్సెస్ కూడా లేదు. అయినా సచిన్ జోషి మాత్రం తన ప్రయత్నాలను మానలేదు. ఈసారి కాస్తా ట్రాక్ మార్చి ఓ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ సినిమా చేశాడు. దీనికి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ను కూడా అల్లాడు. తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు, తమిళంలో విడుదల చేశారు. ఇంతకు సచిన్‌కు వీడెవడు ఎలాంటి గుర్తింపు తెచ్చిందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం.
కథ:
సత్య(సచిన్‌జోషి) నేషనల్ లెవల్ కబడీ ప్లేయర్. గోవా వెళ్లినప్పుడు అక్కడ ఓ ప్రమాదం నుండి శ్రుతి(ఈషా గుప్తా)ని కాపాడుతాడు. కోటీశ్వరుడైన బళ్ళారి జగన్నాథమ్(ప్రభు) కూతురే శ్రుతి. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. జగన్నాథమ్ సత్య, శ్రుతికి పెళ్లి జరిపిస్తాడు. అయితే పెళ్లైన రెండో రోజునే శ్రుతి చంపబడుతుంది. ఆమె శవం కూడా ఎవరికీ దొరకదు. కేసుని డీల్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ ప్రకాష్(కిషోర్) రంగంలోకి దిగుతాడు. అసలు శ్రుతిని ఎవరు చంపారు? చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
- కథనం
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే కాన్సెప్ట్ కాదు
- పాటలు బాలేవు
సమీక్ష:
నటీనటులందరూ వారి వారి ప్రాతలకు చక్కగా నాయ్యం చేశారు. అందరిలో కంటే సచిన్ జోషియే పెర్ఫామెన్స్ పరంగా వీక్‌గా అనిపించాడు. ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో ఇంకా బెటర్‌మెంట్ ఉంటే బావుండుననిపించింది. ఈషా గుప్తా లుక్ పరంగా బావుంది. తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక ప్రభు, కిషోర్, సుప్రీత్, సెల్ఫీ రాజుగా వెన్నెలకిషోర్ ఇలా అందరూ చక్కగా వారి పాత్రల్లో నటించారు. ఇక టెక్నికల్‌గా చూస్తే తాతినేని సత్య గతంలో చేసిన మూడు సినిమాలు రీమేక్‌లే. ఈ సినిమా సత్య చేసిన తొలి స్ట్రయిట్ మూవీ. కథనం క్రైమ్ థ్రిల్లర్ తరహాలో క్వశ్చనింగ్ పాయింట్‌లో స్టార్ట్ అయ్యి దాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చే తీరు బావుంది. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా అనిపిస్తుంది. కబడీ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, పాటలు ఇలా అన్నింటి పిక్చరైజేషన్స్‌లో బినేంద్ర తన మార్కు చూపించాడు. ఇక థమన్ ట్యూన్స్ పెద్దగా ఎఫెక్టివ్‌గా లేకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగదీశాడు. ప్రవీణ్‌పూడి కూడా సినిమా వ్యవథి ఎక్కువ కాకుండా చూసుకున్నాడు. అయితే క్రైమ్ థ్రిల్లర్‌లో కన్‌ఫ్యూజన్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సగటు ప్రేక్షకుడు కన్‌ఫ్యూజ్ అవుతాడు. ఈ సినిమాలో కూడా అది కామనే. ఇక సాంగ్స్ ప్లేస్ మెంట్లో జైలులో ఐటెమ్ సాంగ్ ఏంటో డైరెక్టర్‌కే తెలియాలి. పర్టికులర్‌గా క్రైమ్ థ్రిల్లర్‌సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు సినిమాను బాగా ఆస్వాదిస్తారనడంలో సందేహం లేదు.
బాటమ్ లైన్: వీడెవడు...ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్
Veedevadu Movie Review in English
- Read in English