‘వేదం’ నాగయ్య మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
‘వేదం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగయ్య శనివారం కన్నుమూశారు. కష్టాలు అనుభవించే నిరుపేద రైతు పాత్రలో ఎక్కువగా ఆయన కనిపించారు. నిజ జీవితంలోనూ ఆయన చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. 2015 సమయంలో తినడానికి తిండి లేక ఆకలి బాధతో అలమటించారు. ఆ సమయంలో ఆయనకు తెలంగాణ మంత్రి కేటీఆర్, మా అసోసియేషన్ ఆపన్న హస్తం అందించారు. అప్పటి నుంచి ప్రభుత్వం పెన్షన్ కూడా అందిస్తూ వచ్చారు. నాగయ్య 30కి పైగా సినిమాలలో నటించి మెప్పించారు.
గుంటూరు జిల్లా, నర్సరావు పేట సమీపంలోని దేసవరం పేట గ్రామానికి చెందిన నాగయ్యకు ఊర్లో రెండెకరాల భూమి ఉండేది. అక్కడ పని లేకపోవడంతో కొడుకుతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. అనంతరం పలు సినిమాల్లో అవకాశం సంపాదించారు. ఇచ్చిన డైలాగ్‌ని కంఠస్తం పట్టి గడగడ చెప్పడంతో అతని ప్రతిభని గుర్తించి వేదం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇక అప్పటి నుండి అతనికి వేదం నాగయ్యగా పేరు వచ్చింది. నాగవల్లి, ఏ మాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్, లీడర్.. ఇలా పలు సినిమాలలో నటించిన నాగయ్య తొలుత మూడు వేల పారితోషికం అందుకున్నారు. ఇటీవలే నాగయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments