‘వేదం’ నాగయ్య మృతి

  • IndiaGlitz, [Saturday,March 27 2021]

‘వేదం’ సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నాగ‌య్య శ‌నివారం క‌న్నుమూశారు. కష్టాలు అనుభవించే నిరుపేద రైతు పాత్రలో ఎక్కువగా ఆయన కనిపించారు. నిజ జీవితంలోనూ ఆయన చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. 2015 సమయంలో తినడానికి తిండి లేక ఆకలి బాధతో అలమటించారు. ఆ సమయంలో ఆయనకు తెలంగాణ మంత్రి కేటీఆర్, మా అసోసియేష‌న్ ఆపన్న హస్తం అందించారు. అప్పటి నుంచి ప్రభుత్వం పెన్షన్ కూడా అందిస్తూ వచ్చారు. నాగయ్య 30కి పైగా సినిమాల‌లో న‌టించి మెప్పించారు.

గుంటూరు జిల్లా, న‌ర్స‌రావు పేట స‌మీపంలోని దేస‌వ‌రం పేట గ్రామానికి చెందిన నాగ‌య్యకు ఊర్లో రెండెక‌రాల భూమి ఉండేది. అక్క‌డ ప‌ని లేక‌పోవ‌డంతో కొడుకుతో క‌లిసి హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. అనంతరం పలు సినిమాల్లో అవకాశం సంపాదించారు. ఇచ్చిన డైలాగ్‌ని కంఠ‌స్తం ప‌ట్టి గ‌డ‌గ‌డ చెప్ప‌డంతో అత‌ని ప్ర‌తిభ‌ని గుర్తించి వేదం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇక అప్ప‌టి నుండి అత‌నికి వేదం నాగ‌య్యగా పేరు వ‌చ్చింది. నాగ‌వ‌ల్లి, ఏ మాయ చేశావే, రామయ్య వ‌స్తావ‌య్యా, స్పైడ‌ర్, లీడర్.. ఇలా ప‌లు సినిమాల‌లో న‌టించిన నాగ‌య్య తొలుత మూడు వేల పారితోషికం అందుకున్నారు. ఇటీవ‌లే నాగయ్య భార్య అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

More News

షాకింగ్.. ఓ మహిళను కోట్లకు అధిపతిని చేసిన నత్త

అదృష్టం ఎప్పుడు.. ఎలా.. ఎవరిని.. ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం.

ఎమోషనల్ వీడియోతో చెర్రీకి బర్త్‌డే విషెస్ చెప్పిన మెగాస్టార్

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా అటు ‘ఆర్ఆర్ఆర్’ ఇటు ‘ఆచార్య’ ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారికి సంబంధించిన సెకండ్ వేవ్ బీభత్సంగా ఉంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య దారుణంగా పెరిగిపోతోంది.

దేశంలో విజృంభించిన మహమ్మారి.. 60 వేలకు చేరువలో కేసులు

కొన్ని నెలలుగా కరోనా కేసులు చాలా వరకూ తగ్గిపోయాయి. దాదాపు ఈ ఏడాది ఆరంభం నుంచి కరోనా కేసులు పెద్దగా నమోదవడం లేదు.

‘ఆచార్య’తో కలిసి సిద్ద... సర్‌ప్రైజ్ అదిరిపోయిందిగా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘ఆచార్య’ చిత్ర యూనిట్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను అందజేసింది.