డైరెక్ట‌ర్ పిచ్చి రాత‌లకి చెక్ పెట్టిన హీరో....

  • IndiaGlitz, [Monday,October 29 2018]

సినిమాలు విడుద‌ల‌వుతున్న‌ప్పుడు రివ్యూలు గురించి కొంత మంది ప్రేక్ష‌కులు ఎదురు చూడ‌టం కామ‌న్‌గానే జ‌రుగుతుంటుంది. అలాగ‌ని సినిమా అంతా రివ్యూల‌పైనే ఉంటుందా? అంట అది ముమ్మాటికీ అబ‌ద్ధ‌మే. మంచి సినిమాల‌కు అది చిన్న బ‌డ్జెట్‌, పెద్ద బ‌డ్జెట్ చిత్రాలు ఏవైనా కావ‌చ్చు. రివ్యూల‌కు అతీతంగా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన‌వి చాలానే ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు బిచ్చ‌గాడు సినిమా విడుద‌లైన మూడు నాలుగు రోజుల వ‌ర‌కు అస‌లు రివ్యూలే రాయ‌లేదు.

అలాగ‌ని ఆ సినిమా ప్లాప్ అయ్యిందా? ప‌్రేక్ష‌కులు సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. సినిమాను చూసిన విమ‌ర్శ‌కులు త‌మ కోణంలో రివ్యూ రాస్తారంతే.. అంత మాత్రాన వారు సినిమాను వ్య‌తిరేకించ‌న‌ట్లు కాదుగా! సినిమాలో ద‌మ్ముందా..నీ క‌థ‌, స్క్రీన్‌ప్లే సామాన్య ప్రేక్ష‌కుడికి అర్థ‌మవుతుందా? అని డైరెక్ట‌ర్ స‌రి చూసుకోవాలి. తాను తెలివైన‌వాడిన‌నే భ్ర‌మ‌లో ఉండే కొంత మంది డైరెక్ట‌ర్స్ ఆ లాజిక్‌ను మిస్ అవుతారు. రివ్యూలు రాసిన వారిని నోటికొచ్చిన‌ట్లు అనేస్తుంటారు.

వీర భోగ వసంత రాయ‌లు గ‌త శుక్ర‌వారం థియేట‌ర్స్‌లో విడుద‌లై డిజాస్ట‌ర్ అయ్యింది. సినిమాకు పూర్ రివ్యూస్ వ‌చ్చాయి. పోనీ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించారా? అంటే అదీ లేదు. అస‌లు త‌మ సినిమాను ప్రేక్ష‌కులు చూడ‌లేద‌నే కోపాన్ని విమ‌ర్శ‌కుల మీద చూపించుకున్నారు స‌ద‌రు చిత్ర ద‌ర్శ‌కుడు, నిర్మాణ సంస్థ 'ఫ‌క్ రివ్యూస్ వాచ్ ద మూవీస్ ఇన్ థియేట‌ర్స్ అండ్ ఫీల్ ది క‌ల్ట్‌' అంటూ ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన‌.ఆర్ ఓ అడుగు ముందుకేసి ఓ చెడ్డ చిత్రాన్ని మీ రివ్యూస్‌తో బ్ర‌తికించవ‌చ్చు కానీ మంచి చిత్రాన్ని రివ్యూస్‌తో చంపేయ‌లేరు.

షేమ్ ఆన్ యు. రివ్యూలు రాసిన వాళ్లు సినిమాను అర్థం చేసుకోలేక‌పోయుండ‌వ‌చ్చు. నేను హిమాల‌యాల‌కు వెళ్లిపోతాను' అంటూ తన ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కుకున్నాడు. అయితే ద‌ర్శ‌కుడికి భిన్నంగా హీరో శ్రీవిష్ణు ట్విట్ట‌ర్‌లో కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. నేను రివ్యూస్‌కి వ్య‌తిరేకం కాను. ద‌ర్శ‌కుడు, నిర్మాణ సంస్థ చేసిన ప‌నికి, త‌న‌కి ఎలాంటి సంబంధం లేద'న్నాడు. ఒక్క‌సారిగా హీరో రివ‌ర్స్ కావ‌డం ద‌ర్శ‌కుడికి షాకే.. ఇప్ప‌టికే సుధీర్‌తో సున్పం పెట్టుకున్న ఈ డైరెక్ట‌ర్ పిచ్చి రాత‌ల‌కి శ్రీవిష్ణు త‌గిన సమాధానం చెప్పాడ‌ని అంద‌రూ అనుకుంటున్నారు.