21న వస్తున్న నయనతార 'వసంతకాలం'
Send us your feedback to audioarticles@vaarta.com
లేడి సూపర్ స్టార్ నయనతార నటించగా ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ ను 'వసంత కాలం' పేరుతొ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి 'బిల్లా-2' ఫేమ్ చక్రి తోలేటి దర్సకత్వం వహించారు.
'5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై ఇంతకుముందు 'ఏకవీర, వెంటాడు-వేటాడు" వంటి భారీ చిత్రాలు అందించిన యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. "టాప్ హీరోలకు తీసిపోని సూపర్ క్రేజ్ కలిగి, ఇటు మెగాస్టార్ చిరంజీవితో 'సైరా'లో మెప్పించి.. అటు సూపర్ స్టార్ రజినీకాంత్ తో 'దర్బార్'లో జత కటైన నయనతార నటించిన హీరోయిన్ ఓరియంటడ్ చిత్రం 'వసంతకాలం'ను నిర్మిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను.
ఈనెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నయనతార నటన-గ్లామర్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్, చక్రి తోలేటి దర్శకత్వం, భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ తదితరుల పాత్రలు 'వసంతకాలం' చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. సుస్పెస్న్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధించి.. నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుతుందనే నమ్మకముంది.. అన్నారు!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com