అండర్ వాటర్ లో ఎమోషనల్ రొమాన్స్..'వసంత కోకిల' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
తన విలక్షణ నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబీ సింహా. ఎలాంటి పాత్రలో అయినా సింహా అద్భుతంగా నటించగలడు. నెగిటివ్ రోల్స్ అయితే తన విశ్వరూపమే ప్రదర్శిస్తాడు సింహా. 2014లో వచ్చిన జిగర్తాండ చిత్రం సింహా క్రేజ్ ని అమాంతం పెంచేసింది.
ఆ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ లో సింహా నటన అద్భుతం అనే చెప్పాలి. ఆ చిత్రాన్నే తెలుగులో గద్దలకొండ గణేష్ గా రీమేక్ చేశారు. ఇదిలా ఉండగా సింహా నుంచి తాజాగా వస్తున్న చిత్రం 'వసంత కోకిల'. తెలుగు, తమిళ, కన్నడలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు.
ఉత్కంఠ కలిగించేలా ఉన్న టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచే విధంగా ఉంది. ఈ చిత్రంలో సింహా, యంగ్ బ్యూటీ కాశ్మీరా పర్దేషి జంటగా నటిస్తున్నారు. టీజర్ ఓపెనింగ్ షాట్ లో వీరిద్దరి మధ్య అండర్ వాటర్ రొమాన్స్ చూపించారు.
కన్ఫ్యూషన్, పెయిన్, ఆవేశం ఇలా అన్ని షేడ్స్ ఉన్న వ్యక్తిగా సింహా ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఏదో మిస్టీరియస్ సబ్జెక్టుతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు టీజర్ ద్వారా అర్థం అయింది. రమణన్ పురుషోత్తమ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఎస్ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రజిని తాళ్లూరి నిర్మిస్తున్నారు. రాజేష్ మురుగేశన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com