Operation Valentine:ఏం జరిగినా సరే చూసుకుందాం.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్‌లో వరుణ్‌తేజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, హిందీ ట్రైలర్‌ను భాయిజాన్ సల్మాన్‌ఖాన్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. ఇందులో భారత వైమానిక దళ అధికారి పాత్రలో వరుణ్ నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. పాకిస్థాన్ ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఓ పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్ ఈ మూవీలో కనిపించాడు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ట్రైలర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. విజువల్స్ ఎంతో రిచ్‌గా ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా పాకిస్థాన్ దేశంపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే దానిపై ఆసక్తి రేపారు. ముఖ్యంగా ఇందులో డైలాగులు దేశ భక్తిని రగిలించేలా ఉన్నాయి. చివర్లో 'ఏం జరిగినా సరే చూసుకుందాం' అనే డైలాగ్‌తో ట్రైలర్ ఎండ్ అయింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇటీవల వరుణ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అందుకే ఇప్పటివరకూ తన సినిమాలకి ఎప్పుడూ చేయనంత ప్రమోషన్స్ ఈ చిత్రానికి చేస్తున్నాడు. ఇందుకోసం బాలీవుడ్ మీడియాకు 30కి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అలాగే పలు కాలేజీలకు వెళ్లి సందడి చేశాడు. తెలుగులోనూ వినూత్నంగా మూవీ ప్రమోషన్స్ చేపట్టేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఇక ఈ సినిమాను సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించగా.. రుహానీ శర్మ, నవదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి ఒకటిన ప్రపంచవ్యాప్తంగా మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout