చిరు పాత్ర‌లో వ‌రుణ్ తేజ్‌.. అయితే కండీష‌న్ అప్లై...

  • IndiaGlitz, [Sunday,August 12 2018]

ఎన్టీఆర్ బయోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ క్రిష్ వీలైనన్ని హంగుల‌ను అద్దుతున్నారు. విద్యాబాల‌న్‌, జిన్‌సేన్ గుప్తా, స‌చిన్ ఖేడేక‌ర్‌, రానా త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

కాగా అతిథి పాత్ర‌లో శ్రీదేవిగా ర‌కుల్ న‌టిస్తుండ‌గా.. ఎ.ఎన్‌.ఆర్ పాత్ర‌లో సుమంత్ న‌టిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో గెస్ట్ రోల్‌లో చిరుని కూడా చూపించాల‌నుకున్న క్రిష్ .. చిరు గెస్ట్ పాత్ర‌లో న‌టించ‌మ‌ని హీరో వ‌రుణ్‌తేజ్‌ని సంప్ర‌దించాడ‌ట‌.

క్రిష్‌తో ఉన్న ప‌రిచ‌యం కార‌ణంగా వ‌రుణ్ నో చెప్ప‌లేదు కానీ.. పెద్ద‌నాన్న చిరంజీవికి చెప్పి.. ఆయ‌న ఒప్పుకుంటేనే ఆయన పాత్ర‌లో న‌టిస్తాన‌ని అన్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.