వరుణ్ జోడిగా డబ్ స్మాష్ బ్యూటీ...
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ సంక్రాంతికి ఎఫ్ 2తో సక్సెస్ అందుకున్న హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. తదుపరి చిత్రంలో వరుణ్ `వాల్మీకి` చేస్తున్నాడు. ఇది తమిళ చిత్రం `జిగర్ తండా`కు రీమేక్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ నెలలో చిత్రీకరణను జరుపుకోనుంది.
గ్యాంగ్ స్టర్ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో వరుణ్‌తో మృణాళిని రవి నటించనుందని సమాచారం. తమిళనాట డబ్ స్మాష్ వీడియోలతో మృణాళిని రవి పాపులర్ అయ్యారు. ఈమెను వరుణ్‌తో నటింప చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా ఫోటో షూట్ కూడా పూర్తయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments