సాయిధరమ్ తేజ్ కి పోటీగా వరుణ్‌తేజ్?
Send us your feedback to audioarticles@vaarta.com
ఫిబ్రవరి 9, 2018.. ఈ రోజున ఇద్దరు మెగా ఫ్యామిలీ హీరోలు నువ్వా నేనా అంటూ పోటీపడనున్నారా? అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. కాస్త వివరాల్లోకి వెళితే.. ఖైదీ నెం.150 తరువాత ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ తన తదుపరి చిత్రాన్ని మెగా వారి కథానాయకుడు సాయిధరమ్ తేజ్‌తో తెరకెక్కిస్తున్నాడు.
ఇంటెలిజెంట్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా, ఇదే తేదికి ఫిదాతో తొలి బ్లాక్‌బస్టర్‌ని సొంతం చేసుకున్న మరో మెగా వారి కథానాయకుడు వరుణ్ తేజ్ కూడా తన కొత్త చిత్రంతో రావడానికి సిద్ధమయ్యాడు.
వెంకీ అట్లూరి అనే నూతన దర్శకుడుతో వరుణ్ ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తొలి ప్రేమ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాకి కూడా థమన్ నే సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని కూడా ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ధ్రువీకరించింది. మరి.. ఈ మెగా ఫ్యామిలీ హీరోలు ఇద్దరూ అదే రోజున వస్తారా? ఇద్దరిలో ఏ ఒక్కరో తమ సినిమాని వాయిదా వేసుకుంటారా? వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com