మరో మెగా హీరోకు కరోనా...

  • IndiaGlitz, [Tuesday,December 29 2020]

తాను కరోనా బారిన పడ్డానంటూ మంగళవారం ఉదయం మెగా పవర్ స్టార్హీ రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెర్రీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే తాను కూడా కరోనా బారిన పడినట్టు మరో మెగా హీరో ప్రకటించాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తనకు స్వల్ప లక్షణాలుండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని వరుణ్ తేజ్ వెల్లడించాడు.

‘‘ఈ రోజు ఉదయం నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోవిడ్ 19కు సంబంధించిన స్వల్ప లక్షణాలున్నాయి. నేను ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాను. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు’’ అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే విక్టరీ వెంకటేశ్‌తో కలిసి ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

More News

‘ఆచార్య’లో ఛాన్స్ కొట్టేసిన మెహబూబ్..

బిగ్‌బాస్ సీజన్ 4లో మెహబూబ్ దిల్ సే చివరి వరకూ ఉండకపోయినా.. తన టాస్క్‌లు ఆడే విధానంతో పాటు..

పవనే పెద్ద బోడిలింగం: కొడాలి నాని..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. తాజాగా పవన్ పంచ్ డైలాగ్‌లతో కొడాలి నానిపై సెటైర్లు వేశారు.

'తొంగి తొంగి చూడమాకు చందమామ' ట్రైలర్, ఆడియో రిలీజ్

గురు రాఘవేంద్ర సమర్పణలో హరి వల్లభ ఆర్ట్స్ పతాకంపై దర్శకుడు ఆనంద్ కానుమోలు రూపొందించిన సినిమా ''తొంగి తొంగి చూడమాకు చందమామ''.

యంగ్ డైరెక్ట‌ర్‌కు రామ్‌చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్‌...!

రాంచరణ్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

భారత్‌లోకి ప్రవేశించిన కొత్త స్ట్రెయిన్.. హైదరాబాద్‌లో 2 కేసులు..

కొత్త స్ట్రెయిన్ గురించి తెలిసీ తెలియగానే యూకే నుంచి విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.