డ‌బ్బింగ్ స్టార్ట్ చేసిన వ‌రుణ్‌తేజ్‌

  • IndiaGlitz, [Sunday,November 18 2018]

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తున్న మెగా క్యాంప్ హీరో వ‌రుణ్ తేజ్ ఇప్పుడు టాలీవుడ్ తొలి స్పేస్ మూవీ 'అంత‌రిక్షం 9000 కె.ఎం.పి.హెచ్‌'లో న‌టిస్తున్నాడు. 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి.. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్‌కు కూడా దర్శకత్వం వహించారు.

అదితి రావ్ హైదరి, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి.. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అందులో భాగంగా వ‌రుణ్ తేజ్ ఈ సినిమాకు డ‌బ్బింగ్ స్టార్ట్ చేశాడ‌ట‌. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.