వరుణ్ తేజ్ - శ్రీను వైట్ల మూవీ టైటిల్ ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిస్టర్ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబ్బా పటేల్ నటిస్తున్నారు. మే 15 నుంచి స్పెయిన్ లో షూటింగ్ ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...ఈ మూవీకి స్ర్కిప్ట్ టెర్రిఫిక్ గా వచ్చింది. ప్రస్తుతం డైలాగ్ వెర్షెన్ రెడీ అవుతుంది. ఊటీలో డైరెక్టర్ శ్రీను వైట్ల, రైటర్స్ గోపీ మోహన్, శ్రీధర్ సీపాన ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ నెలాఖరున లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. మే 15 నుంచి నెల రోజులు పాటు స్పెయిన్ లో ఫస్ట్ షెడ్యూల్ చేయనున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కి జే మేయర్, కెమెరా కె.యువరాజ్, సమర్పణ బేబీ భవ్య
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments