వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి మూవీ అప్‌డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. అంతరిక్ష నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వరుణ్ వ్యోమగామిగా నటించనున్నారు. ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉన్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా అదితి రావ్ హైదరిని ఎంపిక చేశారు. రెండో హీరోయిన్‌గా నార్త్ ఇండియన్ బ్యూటీ కావ్యా థాపర్ పేరు పరిశీలనలో ఉంది. ప్రకాష్ రాజ్ సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది.
ఈ చిత్రాన్ని ‘కంచె’ నిర్మాత రాజీవ్ రెడ్డి నిర్మించనుండగా.. క్రిష్ జాగర్లమూడి సహ నిర్మాతగా, సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఈ నెల మూడో వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. ఇందులో భాగంగా.. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిత్రీకరించనున్నారు.
‘రంగస్థలం’ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక ఈ సినిమాకి కూడా పని చేస్తుండడం విశేషం. హైదరాబాద్ వెలుపల వీరు అంతరిక్షానికి సంబంధించి ఓ స్పెషల్ సెట్‌ను వేయబోతున్నారని తెలుస్తోంది. సినిమాకి సంబంధించి చాలా భాగం ఈ సెట్‌లోనే చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని త్వరలోనే లాంచ్ చేసి.. మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ పేర్లను ప్రకటించనున్నారు. దీంతోపాటు.. సాగర్ చంద్ర డైరెక్షన్‌లో కూడా వరుణ్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments