తృటిలో తప్పిన ప్రమాదం.. వరుణ్ తేజ్ స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు, మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌కు ఈరోజు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళ్తే తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట దగ్గర వరుణ్‌తేజ్ కారు ప్రమాదానికి గురైంది. అయితే వరుణ్‌తేజ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుండి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. కానీ కారు మాత్రం ధ్వంసమైంది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ `వాల్మీకి` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు సినిమా షూటింగ్ యాగంటిలో ఉంది. షూటింగ్ నిమిత్తం వరుణ్ యాగంటి వెళుతుండగా ఎదురుగా కొందరు కుర్రాళ్లు కారులో వచ్చి ఢీ కొట్టారు. వరుణ్ కారును ఢీ కొట్టిన కుర్రాళ్లు మద్యం మత్తులో ఉన్నారు. కారు ప్రమాదం జరగ్గానే కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో.. వరుణ్‌కు ఎలాంటి హాని జరగలేదు.
తనతో సహా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అందరం క్షేమమే. ఎలాంటి గాయాలూ కాలేదు. మీ ప్రేమకు, అభిమానికి కృతజ్ఞతలు` అంటూ ట్విట్టర్ ద్వారా వరుణ్ తేజ్ తన స్పందనను తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com