రామ్ చరణ్ స్థానంలో వరుణ్...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కిన `తని ఒరువన్` సినిమాను తెలుగులో `ధృవ` అనే పేరుతో రాంచరణ్ హీరోగా రూపొందించారు. రెండు భాషల్లోనూ సినిమా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతల కన్ను ఈ సినిమాపై పడింది. బాలీవుడ్ వెర్షన్‌ను షబీర్ ఖాన్ తెరకెక్కిస్తాడట. రామ్‌చరణ్ స్థానంలో వరుణ్ ధావన్ నటిస్తుంటే, ఇంటెలిజెంట్ క్రిమినల్ పాత్రలో అర్జున్ కపూర్ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం షబీర్ దర్శకత్వంలో `మున్నా మైఖేల్` సినిమా రూపొందుతోంది. ఈ సినిమాఇ పూర్తి కాగానే రీమేక్ సినిమాకోసం రంగం సిద్ధమవుతుంది. ఐపిఎస్ ఆఫీసర్‌కు, ఇంటిలిజెంట్‌కు మధ్య నడిచే తెలివైన గేమ్ ప్లాన్ ఇది. తెలుగు, తమిళంలో అరవింద్ స్వామి విలన్‌గా నటించి మెప్పించాడు. ఇప్పుడు అరవింద్ స్వామి స్థానంలో అర్జున్ కపూర్ నటించడమంటే కత్తిమీద సామే అనాలి. మరి అర్జున్ ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments