మేర్లపాక డైరెక్షన్ లో వరుణ్ తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ప్రిన్స్ మాంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆయన ఏం చేసినా ఇప్పుడు ఆసక్తికరంగానే ఉంది. `తొలిప్రేమ`, `అంతరిక్షం`, `వాల్మీకి`... ఇలా సినిమా సినిమాకూ వైవిధ్యంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆయన నటించిన `వాల్మీకి` ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమాకు కమిట్ అయ్యారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించే ఆ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుంది. అది పూర్తి కాగానే వరుణ్ యువీ క్రియేషన్స్ లో సినిమా చేస్తారని తెలిసింది. తాజా చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు.
ఇటీవల గాంధీ చెప్పిన కథ వరుణ్‌కి చాలా బాగా నచ్చిందట. ఆ ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి యువీ క్రియేషన్స్ సుముఖంగా ఉందట. సో ఇప్పుడు వరుణ్ డేట్స్ బ్లాక్ చేసే పనిలో ఉన్నారు వంశీ, ప్రమోద్. అన్నీ ఓకే అయితే ఈ ఏడాది ఆఖరు నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది వేసవికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇతర టెక్నీషియన్లను, ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు గాంధీ. వరుణ్‌తేజ్ తన `వాల్మీకి` పనుల్లో బిజీగా ఉన్నారు. యువీ క్రియేషన్స్ `సాహో` పోస్ట్ రిలీజ్ పనుల్లో ఉన్నారు. సో ఈ ఏడాది ఎండింగ్‌కి అంతా ఒక దారికి వస్తుంది.
మేర్లపాక గాంధీకి యువీ క్రియేషన్స్ లో ఇది తొలి చిత్రం కాదు. ఇంతకు ముందు ఆయన ఇదే సంస్థలో శర్వానంద్‌తో `ఎక్స్ ప్రెస్ రాజా` చేశారు. ఆ ప్రాజెక్ట్ సంస్థకు లాభాలు మిగిల్చింది.
తొలి సినిమా సందీప్ కిషన్‌తో, రెండో సినిమా శర్వానంద్‌తో, మూడో సినిమా నానితో చేసిన మేర్లపాక గాంధీ... తొలిసారి మెగా కాంపౌండ్ హీరోతో చేస్తున్నారు. మెగా కాంపౌండ్ హీరోతో యువీ క్రియేషన్స్ కు కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout