Varun Tej:‘‘పలాస 1978’’ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్.. విశాఖ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీ, కథ మామూలుగా వుండదట
- IndiaGlitz, [Saturday,May 06 2023]
నేటితరం హీరోల్లో కాకుండా వినూత్నమైన కథలకు ప్రాథాన్యతనిస్తూ సినిమాలు చేస్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్‌ల నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వరుణ్ తేజ్.. తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ముకుంద నుంచి నిన్న మొన్నటి ఎఫ్ 3 వరకు ఆయన సినిమాల్లో ఏదో ఒక స్పెషాలిటీ వుంటుంది. లవ్, యాక్షన్, రోమాన్స్, కామెడీ ఇలా అన్ని ఫార్మాట్లలో తనకు తిరుగులేదని వరుణ్ తేజ్ నిరూపించుకున్నారు.
వినూత్న కథలు తెరకెక్కిస్తోన్న కరుణ కుమార్ :
ఈ క్రమంలో ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. పలాస 1978 సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన కరుణ్ కుమార్ దర్శకత్వంలో వరుణ్ నటించనున్నారట. పలాసకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ కూడా మంచి పేరే తెచ్చుకుంది. ఆ వెంటనే గ్యాప్ తీసుకోకుండా మెట్రో కథలు, యాంథాలజీ, కళాపురం సినిమాలను తీశారు. ఇవి ఆహా ఓటీటీలో విడుదలై మంచి పేరు తెచ్చుకున్నాయి. దీంతో వినూత్నమైన కథలను తెరకెక్చించే మరో దర్శకుడు టాలీవుడ్‌కు దొరికినట్లయ్యింది.
1980-90 దశకాల నాటి కథ :
ఈ క్రమంలోనే కరుణ కుమార్ చెప్పిన స్టోరీకి వరుణ్ తేజ్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.ఫిలింనగర్ కథనాల ప్రకారం.. 1980, 90 మధ్యకాలంలో విశాఖపట్నంలో చోటు చేసుకున్న వాస్తవ ఘటనల ఆధారంగా కరుణ కుమార్ పీరియాడికల్ క్రైమ్ స్టోరీని తెరకెక్కించనున్నారట. గతంలో కనిపించని క్యారెక్టర్లో వరుణ్ తేజ్ కనిపిస్తారని టాక్. ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత కరుణ కుమార్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ కథ వినగానే వరుణ్ ఎగ్జయిట్ అయ్యారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో కరుణకుమార్- వరుణ్ తేజ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం వుంది. ఇకపోతే.. వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘‘గాంఢీవదారి అర్జున’’. మరొకటి ఏవియేషన్ థ్రిల్లర్.