వరుణ్ తేజ్ కొత్త చిత్రం విడుదల తేదీ ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాణ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశిఖన్నా జంటగా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ..
నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ - "వరుణ్ తేజ్ హీరోగా మా బ్యానర్లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు వెంకీ అట్లూరి లవ్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా చాలా చక్కగా వచ్చింది. ఇటీవల సినిమా షెడ్యూల్ లండన్‌లో జరిగింది. నలభై రోజుల పాటు ఏకధాటిగా జరిగిన ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణలో 70 శాతం టాకీ పూర్తయ్యింది.
డిసెంబర్ నెలనాటికి షూటింగ్‌ను పూర్తి చేస్తాం. థమన్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్, జార్జ్ సి.విలియమర్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com