వ‌రుణ్ చిత్రానికి రెండు వారాల వ‌ర్క్‌షాప్‌

  • IndiaGlitz, [Saturday,April 14 2018]

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా..  జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన ‘ఘాజీ’కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ సంకల్ప్ రెడ్డి.. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అదితి రావ్ హైదరి, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి.. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం..

ఈ నెలాఖరు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అంతరిక్షం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వరుణ్ వ్యోమగామిగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. హాలీవుడ్‌కు చెందిన కొంతమంది టెక్నీషియ‌న్స్‌.. వరుణ్‌తో పాటు సినిమాలో నటించే మరి కొంతమంది నటీనటులకు శిక్షణ ఇవ్వనున్నారని సమాచారం. అంతేకాకుండా.. ఈ సినిమాలో స్టంట్స్‌ కోసం బల్గేరియా నుంచి కొంతమంది స్టంట్ కొరియోగ్రాఫ‌ర్లు త్వరలో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ స్టంట్స్‌ కోసం వారు ఇక్క‌డ రెండు వారాలు పాటు వర్క్ షాప్‌ను నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ వ్య‌వ‌హారం చూస్తుంటే.. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్  జాతీయ స్థాయిలో గుర్తింపు పొంద‌డం ఖాయ‌మ‌ని టాలీవుడ్‌ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.