డ‌బ్బింగ్‌లో వ‌రుణ్ తేజ్ చిత్రం

  • IndiaGlitz, [Saturday,December 02 2017]

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌థానాయ‌కుడుగా నటిస్తున్న తాజా చిత్రం 'తొలి ప్రేమ' (ప్ర‌చారంలో ఉన్న పేరు). డెబ్యు డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌ గా తెరకెక్కుతున్న‌ ఈ మూవీని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ , రాశి ఖన్నా జంటగా నటిస్తున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి చిత్ర‌మిదే కావ‌డం విశేషం.

తాజాగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయ‌ని తెలిసింది. డబ్బింగ్ పనులు కూడా ఇప్ప‌టికే మొదలయ్యాయి. వరుణ్ తేజ్ ఈ సినిమాలో మూడు స్టైలిష్ లుక్స్ లో కనిపించబోతున్న‌ట్లు స‌మాచారం. చాలా డిఫరెంట్ గా వరుణ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి.

థమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఫిబ్రవరి 9న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిదా వంటి బ్లాక్‌బ‌స్టర్ మూవీ త‌రువాత వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

More News

లేడీ డాన్స్ మాస్టర్ తో బన్నీ

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి యువ క‌థానాయ‌కుల్లో బ‌న్నికి ఓ సెప‌రేట్ గుర్తింపు ఉంది. అదే డ్యాన్స్ బాగా చేస్తాడ‌ని. అందుకు త‌గిన‌ట్టు బ‌న్ని కూడా త‌న సినిమాల్లో డ్యాన్సులు ప్ర‌త్యేకంగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు.

జెనీలియా రీ ఎంట్రీ...

బాయ్స్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన జెనీలియాకు తెలుగు, త‌మిళంలో మంచి పేరు తెచ్చిన సినిమా 'బొమ్మ‌రిల్లు'.  హ హ హాసినిగా జెనీలియా ఇంకా గుర్తుంది.

సాయిధరమ్ తేజ్ తో పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే - ప్రసన్న

'జవాన్' సినిమాలో కేశవ అనే క్యారెక్టర్ కోసం రవిగారు కొత్త నటుడు కావాలని వెతుకుతున్నప్పుడు రచయితలు గోపీమోహన్, కోన వెంకట్ లు నా పేరును రవికి చెప్పారు.

డిసెంబర్ 28న 'ఒక్క క్షణం' ?

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ రూపొందించిన ఈ సినిమా మంచి కథా కథనంతో ఆసక్తిగా ఉంటుందని వినికిడి.

శ్రీపతి కర్రి దర్శకత్వంలో వస్తున్న'హల్ చల్' ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీపతి కర్రి దర్శకత్వంలో గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న చిత్రం హల్ చల్. రద్రాక్ష్ ఉత్కమ్, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తున్నారు.