ఏప్రిల్ 14న వరుణ్ తేజ్ 'మిస్టర్'
- IndiaGlitz, [Sunday,March 12 2017]
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి,హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మాతలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మిస్టర్'. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా...
దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ - ''డైరెక్టర్‌గా 'మిస్టర్' వంటి కథ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మంచి ఎమోషన్స్‌కి, హిలేరియస్ ఎంటర్‌టైనింగ్‌కి, బ్యూటీఫుల్ మ్యూజిక్‌కి, విజువల్స్‌కు స్కోప్ ఉన్న సబ్జెక్. రెండు పాటలు మినహా సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అందులో భాగంగా రీ రికార్డింగ్ తుది దశలో ఉంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నిర్మాతల సహకారంతో నేను ఏదైతే అనుకున్నానో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా పూర్తి చేయగలిగాను. ఈ సినిమాలో నాకు సహకారం అందించిన వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి సహా మిగతా నటీనటులుందరికీ, టెక్నిషియన్స్‌కు థాంక్స్. అందరూ తమ సినిమాగా భావించి ఎంతో కష్టపడ్డారు. ఇదొక ట్రావెల్ మూవీలా ఉంటుంది. అందుకోసం స్పెయిన్‌లో షూట్ చేశాను. ఇండియాలో చిక్ మంగళూర్, చాళకుడి, ఊటీ, హైదరాబాద్ ప్రాంతాల్లో మంచి లోకేషన్స్‌లో షూట్ చేశాం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జె.మేయర్‌గారు ఆరు ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్ అందించారు. ఆయనతో కలిసి చేస్తున్న తొలి సినిమా ఇది. రీసెంట్‌గా ఫస్ట్‌హాఫ్‌ను రీరికార్డింగ్‌తో చూశాను. మిక్కిగారు అన్‌బిలివబుల్ ఆర్.ఆర్ ఇచ్చారు. అలాగే మంచి కథ అందించిన గోపీమోహన్‌గారికి, మాటలు అందించిన శ్రీధర్ సీపానకు, ఎక్సలెంట్ విజువల్స్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్‌గారు సహా అందరికీ థాంక్స్'' అన్నారు.
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్, ప్రిన్స్,నాజర్, మురళీశర్మ, తనికెళ్ళభరణి, చంద్రమోహన్, రఘుబాబు, ఆనంద్, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, నాగినీడు, హరీష్ ఉత్తమన్, నికితన్‌ధీర్, షఫీ, శ్రవణ్, మాస్టర్ భరత్, షేకింగ్ శేషు, ఈశ్వరిరావు, సురేఖావాణి, సత్యకృష్ణ, తేజస్విని తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాష్, స్టైలింగ్ః రూప వైట్ల, లిరిక్స్ః కె.కె, రామజోగయ్య శాస్త్రి, కోడైరెక్టర్స్ః బుజ్జి, కిరణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ః కొత్తపల్లి మురళీకృష్ణ, పి.ఆర్.ఓః పులగం చిన్నారాయణ, కథః గోపీ మోహన్, మాటలుః శ్రీధర్ సీపాన, సంగీతంః మిక్కి జె.మేయర్, సినిమాటోగ్రఫీః కె.వి.గుహన్, ఎడిటర్ః ఎం.ఆర్.వర్మ, నిర్మాతలుః నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి),