మిస్టర్ ఫస్ట్ లుక్ & టీజర్ రిలీజ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరో వరుణ్ తేజ్ - శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం మిస్టర్. ఈ చిత్రాన్ని బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు బుజ్ఙి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబ్బా పటేల్ నటిస్తున్నారు. ఇటీవల వికారాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
నూతన సంవత్సరం కానుకగా ఈనెల 31 మధ్యాహ్నాం 3 గంటలకు మిస్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఆతర్వాత 3.30 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీను వైట్ల ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...మిస్టర్ ఫస్ట్ లుక్ & టీజర్ అందరికీ నచ్చుతుంది ఆశిస్తున్నాను అని తెలియచేసారు. అలాగే మిస్టర్ మూవీకి వర్క్ చేసిన రైటర్ గోపీ మోహన్ కూడా రేపు మిస్టర్ ఫస్ట్ లుక్ & టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com