లోఫర్ కి గుమ్మడికాయ
Send us your feedback to audioarticles@vaarta.com
లోఫర్ సినిమాకు గుమ్మడికాయను కొట్టేశారు. వరుణ్ తేజ్‌పై ఆఖరి షాట్‌ను తీసి గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సినిమాలో పెద్ద దొంగగా కనిపిస్తాడు వరుణ్‌తేజ్. వరుణ్ తల్లిగా రేవతి నటిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాను శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు మా అమ్మ సీతామహాలక్ష్మి అనే టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నెలాఖరునగానీ, డిసెంబర్ మొదటివారంలోగానీ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 18న సినిమాను విడుదల చేయాలన్నది ప్లాన్. పూరి జగన్నాథ్ తరహా హీరో కేరక్టరైజేషన్ ఉంటుందట. తన మూడు సినిమాల్లో తనకు బాగా నచ్చిన సినిమా ఇదేనని ఆ మధ్య వరుణ్ తేజ్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments