లోఫర్ మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Thursday,December 17 2015]

న‌టీన‌టులు: వ‌రుణ్‌తేజ్‌, దిశాప‌టాని, బ్ర‌హ్మానందం, రేవతి, పోసాని కృష్ణ‌ముర‌ళి, ముకేష్ రుషి, సంపూర్ణేష్ బాఉ, స‌ప్త‌గిరి త‌దిత‌రులు
కెమెరా: పి.జి.వింద‌
సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌
ఫైట్స్‌: విజ‌య్‌
ఎడిటింగ్: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌

బ్యాన‌ర్స్‌: సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, శ్రీ శుభ‌శ్వేత ఫిలింస్‌
నిర్మాత‌లు: సి.వి.రావు, శ్వేత‌లానా, వ‌రుణ్‌, తేజ‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌

హీరోను మాస్ యాంగిల్‌లో డిఫ‌రెంట్ క్యార‌క్ట‌రైజేష‌న్‌తో చూపించే ద‌ర్శ‌కుల్లో పూరి జ‌గ‌న్నాథ్ ఒక‌డు. మొద‌టి సినిమా ఇడియ‌ట్ నుండి లోఫ‌ర్ వ‌రకు హీరో కొద్దిగా తేడాగానే క‌న‌ప‌డ‌తాడు. ఇక హీరో విష‌యానికి వ‌స్తే వ‌రుణ్ తేజ్ న‌టించిన మూడో సినిమా లోఫ‌ర్‌. తొలి రెండు సినిమాల్లో చాలా సాప్ట్‌గా సాగే క్యారెక్ట‌ర్‌. వ‌రుణ్ విష‌యానికి వ‌స్తే పూరితో చేయ‌డం త‌న‌కు కూడా బెట‌ర్‌. ఎందుకంటే వ‌రుణ్‌లోని మాస్ యాంగిల్‌ను స‌రికొత్త‌గా పూరి ప్రెజెంట్ చేస్తాడ‌నడంలో సందేహం లేదు. సినిమా విషయానికి వ‌స్తే పూరి అమ్మనాన్న ఓ త‌మిళ‌మ్మాయి త‌ర్వాత ఆ రేంజ్ మ‌ద‌ర్ సెంటిమెంట్ మూవీ ఇదేన‌ని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సినిమాకు లోఫ‌ర్ టైటిల్ ఏంటి మారిస్తే బెట‌ర్ క‌దా అని కూడా అనుకున్నారు. కానీ పూరి మాత్రం లోఫ‌ర్ టైటిల్ వైపే మొగ్గు చూపాడు. పూరి టైటిల్స్‌, హీరోలే తేడాగా ఉంటారు కానీ హీరోయిజ‌మ్ పాజిటివ్‌గా ఉటుంది. మ‌రి ఈ లోఫ‌ర్ ఎలా క‌న‌ప‌డ‌తాడో తెలియాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌

ముర‌ళి(పోసాని), ల‌క్ష్మీదేవి(రేవ‌తి) ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. వారికి పుట్టిన బిడ్డ రాజా(వ‌రుణ్ తేజ్‌). పుట్టింటి నుండి లక్ష్మీదేవిని ఆస్థి తెమ్మ‌ని ముర‌ళి పోరు పెడ‌తాడు. గొడ‌వ పెద్దదై విడిపోతారు. ఓ రోజు ల‌క్ష్మీదేవి నుండి రాజాను దొంగ‌త‌నంగా జోధ్‌పూర్‌కు తీసుకెళ్ళిపోతాడు ముర‌ళి. అక్క‌డ ఇద్ద‌రూ క‌లిసి దొంగ‌త‌నాలు, మోసాలు చేసి బ‌తుకుతుంటారు. ఇంట్లో డ‌బ్బున్న రెండో పెళ్ళివాడికిచ్చి క‌ట్టబెట్టాల‌నుకోవ‌డంతో పారిజాతం(దిశాప‌టాని) ఇంటి నుండి పారిపోయి జోధ్‌పూర్ చేరుకుంటుంది. అక్క‌డే రాజా ఆమెకు పరిచ‌యం అవుతాడు. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. కొడుకు ప్రేమ వ్య‌వ‌హారం న‌చ్చ‌ని తండ్రి ముర‌ళి పారిజాతం వివ‌రాల‌ను ఆమె కుటుంబ స‌భ్యుల‌కు తెలిజేస్తాడు. మ‌రోవైపు పారిజాతం త‌న ప్రేమ వ్య‌వ‌హారాన్ని త‌న మేన‌త్త ల‌క్ష్మీదేవికి చెబుతుంది. ల‌క్ష్మీదేవి జోధ్ పూర్ చేరుకోవ‌డం, అప్ప‌టి వ‌రకు త‌ల్లి చ‌నిపోయింద‌నుకుంట‌న్న రాజాకు ఆస‌లు నిజం తెలియ‌డంతో క‌థ అస‌లు మ‌లుపు తిరుగుతుంది. రాజా ఏం చేశాడు? అస‌లు ముర‌ళి, రాజాతో అబద్ద‌మెందుకు చెప్పాడు? త‌ల్లిని రాజా క‌లుసుకున్నాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌

సినిమాలో వ‌రుణ్‌తేజ్ న‌ట‌న గ‌త రెండు చిత్రాల‌కు భిన్నంగా మాస్ యాంగిల్‌లో సాగింది. ఫైట్స్‌, డ్యాన్స్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. డైలాగ్స్ చెప్ప‌డంలో, ఎమోష‌న‌ల్ సీన్స్‌లో బాగా న‌టించాడు. ఇక తండ్రి పాత్ర చేసిన పోసాని త‌న పాత్ర‌లో ఒదిగిపోయాడు. మోసం చేసే తండ్రిగా న‌టిస్తూనే ప్రేక్ష‌కుల‌ను త‌న‌దైన కామెడితో న‌వ్వించాడు. రేవ‌తి అమ్మ‌పాత్ర‌కు న్యాయం చేసింది. సెకండాఫ్ అంతా రేవ‌తి, వ‌రుణ్ మ‌ధ్య‌నే న‌డుస్తుంది. కొడుకును పొగొగ్గ‌టుకున్న త‌ల్లి పాత్ర‌లో రేవ‌తి న‌ట‌న బావుంది. దిశాప‌టాని గ్లామ‌ర‌స్‌గా క‌న‌ప‌డింది. డ్యాన్సులు కూడా బాగా చేసింది. విల‌న్స్‌గా చేసిన ముకేష్‌రుషి అండ్ గ్యాంగ్ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ధ‌న‌రాజ్‌, సప్త‌గిరి త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయంచేశారు. ఇక పూరి విష‌యానికి వ‌స్తే సినిమాను త‌న‌దైన మార్క్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తీర్చిదిద్దాడు. వ‌రుణ్‌తేజ్‌ను మాస్ యాంగిల్‌లో బాగా ప్రెజెంట్ చేశాడు. సినిమాలో సెకండాఫ్ అంతా మ‌ద‌ర్ సెంటిమెంట్ మీద‌నే న‌డిచేలా స్క్రిప్ట్‌ను బాగానే రాసుకున్నాడు. పి.జి.విందా కెమెరావ‌ర్క్ ఓకే, సునీల్ క‌శ్య‌ప్ సంగీతం బావుంది. సువ్విసువ్వాల‌మ్మా..సాంగ్‌, నోట్లో బీడి...అనే మాస్ సాంగ్స్ బావున్నాయి. మిగిలిన‌వ‌న్నీ సో సోగానే ఉన్నాయి.

మైన‌స్ పాయింట్స్‌

పూరి సినిమాను జోధ్ పూర్ బ్యాక్‌డ్రాప్ చూపించాడు. హీరో మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్ వైజాగ్ ద‌గ్గ‌ర ఓ గ్రామంలో ఉంటుంది. కానీ ఆ తేడాను స‌రిగా చూపెట్ట‌లేక‌పోయాడు. ఇక్క‌డ ప్రేక్ష‌కులు చిన్న‌ప‌టి క‌న్‌ఫ్యూజ‌న్‌కు గుర‌వుతారు. ఫ‌స్టాఫ్ అంతా ఫ్టాస్ట్‌గా సాగిపోయే సినిమా సెకండాఫ్ వ‌చ్చేసరికి డ్రాగింగ్‌గా అనిపిస్తుంది. విల‌న్ చ‌ర‌ణ్‌దీప్ ఆమె త‌ల్లిని చంపే సన్నివేశం, బ్ర‌హ్మానందంను కామెడి కోసం వాడుకోవాల‌నుకునే ప్ర‌య‌త్నం చేశారు కానీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. క్ల‌యిమాక్స్ కూడా లాగేసిన‌ట్టుగా ఉంటుంది.

విశ్లేష‌ణ‌

అమ్మానాన్న ఓ త‌మిళ‌మ్మాయి త‌ర్వాత పూరి చేసిన మ‌రో మ‌ద‌ర్ సెంటిమెంట్ మూవీ లోఫ‌ర్‌. పూరి త‌న‌దైన స్ట‌యిల్‌లో హీరోయిజాన్ని ప్రొట్రేట్ చేయ‌డానికి ఫ‌స్టాఫ్‌లో ట్రై చేశాడు. టైటిల్ విష‌యంలో తేడా కొట్టినా సెకండాప్ విష‌యానికి వ‌చ్చేసరికి సినిమా అంతా మ‌ద‌ర్ సెంటిమెంట్ మీద‌నే సాగుతుంది. అయితే హీరో వరుణ్ తేజ్ కు ఈ సినిమా ఓ రకంగా ప్లస్ అవుతుందనండంలో డౌట్ లేదు. పోసాని యాక్షన్ అక్కడక్కడా ఎక్కువైనట్టు అనిపించినా కథ పరంగా ఓకే అనిపించేస్తుంది. రేవతి, వరుణ్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ బావున్నాయి. సునీల్ క‌శ్య‌ప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప‌రావాలేదు. ముఖ్యంగా మ‌ద‌ర్ సెంటిమెంట్‌పై వచ్చేసాంగ్ బావుంది. పి.జి.విందా కెమెరావ‌ర్క్ ఓకే. డైలాగ్స్ కూడా పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించ‌లేదు. పూరి త‌న మార్కు మాస్ విత్ మద‌ర్ సెంటిమెంట్ మూవీని తెర‌కెక్కించాడు.

బాట‌మ్ లైన్‌

లోఫ‌ర్‌.. పూరి స్ట‌యిల్ ఆఫ్ ఎంటర్ టైనర్

రేటింగ్: 3/5

English Version Review