Varun Tej Lavanya Tripathi:వరుణ్ తేజ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. చిరంజీవి ఇంట్లో మెగా ఫ్యామిలీ సందడి, ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. త్వరలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ అపురూప క్షణాల కోసం మెగాభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి చిరంజీవి ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలో లావణ్యను కుటుంబ సభ్యులకు చిరంజీవి పరిచయం చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు చిరంజీవి - సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్ , ఉపాసన, సాయిథరమ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక, సుస్మిత, శ్రీజలతో పాటు చిరంజీవి తల్లి అంజనా దేవి, ఆయన ఇద్దరు చెల్లెల్లు, వారి భర్తలు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా వుండటంతో అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి దూరంగా వున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కాగా.. జూన్ 9న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నాగబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగా హీరోలతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీంతో ఈ జంట ఫారిన్‌లో షికారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే వరుణ్ తేజ్ తన మిత్రులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. స్పెయిన్‌లో జరిగిన ఈ పార్టీకి వరుణ్ ఫ్రెండ్స్‌తో పాటు సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌తో పాటు 40 మంది హాజరైనట్లుగా టాలీవుడ్ టాక్.
ఇకపోతే.. మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్, లావణ్య ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఈ జంట అంతరిక్షం సినిమాలో కలిసి నటించారు. ఇద్దరు ప్రేమలో వున్న విషయం బయటికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. మీడియాలో వీరిద్దరి రిలేషన్‌పై పలుమార్లు గాసిప్స్ వచ్చినప్పటికీ ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు. చివరికి వీరి ప్రేమాయణం నిజమేనని తేలడం, ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇటీవల నాగబాబు నివాసంలో కాబోయే కోడలి చేతుల మీదుగా వినాయక చవితి వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com