'వాసుకి' ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
Friday, May 12, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ బ్లాక్‌బస్టర్ `పుదియ నియమం` తెలుగులో `వాసుకి`గా వస్తున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. `వాసుకి` ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నేడు హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, వరుణ్‌తేజ్ సహా చిత్రయూనిట్ పాల్గొంది.
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ మాట్లాడుతూ -``మలయాళంలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ అదే స్థాయి విజయం అందుకోవడమే గాకుండా.. నయన్‌కి చక్కని పేరు తెస్తుందనే అనుకుంటున్నా. అలాగే తెలుగు వెర్షన్ నిర్మాతకు చక్కని సక్సెస్ దక్కాలని ఆశిస్తున్నా`` అన్నారు.
మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ-``పొరుగు భాషలో పెద్ద హిట్టయిన ఈ చిత్రం తెలుగు నిర్మాతలకు అంతే మంచి ఫలితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నా. నిర్మాత మోహన్ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నా. వాసుకి పెద్ద హిట్టవ్వాలి.. డబ్బు, పేరు తేవాలి`` అన్నారు.
నిర్మాత మోహన్ మాట్లాడుతూ-``మా సినిమా ఫస్ట్‌లుక్‌ని మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ గారు, నాగబాబు గారు లాంచ్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. వారికి ధన్యవాదాలు. ఆ ఇద్దరి చేతులమీదుగా ఫస్ట్‌లుక్ లాంచ్ చేయడమే విజయానికి తొలి మెట్టుగా భావిస్తున్నాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు సాగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments