నిహారిక సూర్యకాంతం చిత్ర ఫస్ట్ లుక్ లాంఛ్ చేసిన వరుణ్ తేజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా తెరకెక్కుతున్న ఎంటర్ టైనర్ సూర్యాకాంతం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంఛ్ చేసాడు. నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్ విడుదల చేసారు చిత్రయూనిట్. ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈయన గతంలో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసారు..
నిహారికతో వెబ్ సిరీస్ కూడా తెరకెక్కించారు గతంలో. ఫస్ట్ లుక్ లో ఓ వైపు ప్రేమ చూపిస్తూనే.. మరోవైపు గొడవ పడుతున్నారు నిహారిక, రాహుల్. ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సూర్యాకాంతం షూటింగ్ పూర్తైపోయింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో శివాజీ రాజా, సుహాసిని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ యుఎస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సూర్యాకాంతం సినిమాకు సమర్పకుడిగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com