వరుణ్ తేజ్, క్రిష్ 'కంచె' పూర్తి

  • IndiaGlitz, [Tuesday,July 07 2015]

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించిన చిత్రమే 'కంచె'.

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ఇటివలే (జూలై 6 2015) షూటింగ్ ను దిగ్విజయం గా పూర్తి చేసుకుంది. భారీ వ్యవయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్ట ను పెంచే చిత్రం అవుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు.

ఈ చిత్రం నుండి ఒక ఫోటో ని హీరో వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా రిలీజ్ చేయగా, యువత నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం రిలీజ్ డేట్ మరియి ఇతర వివరాలు త్వరలోనే తెలుపబడతాయి.

'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు .

More News

ఆడియో ఇక్కడ ప్లాన్ చేయడం లేదట...

పి.వి.పి.ప్రొడక్షన్ బ్యానర్ పై అనుష్క, ఆర్య, శృతిహాసన్ ప్రధానపాత్రల్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’.

పవన్ ని ఎత్తేస్తున్న కోన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ప్రస్తుత రాజకీయాలపై, వోటుకి నోటు, సెక్షన్ 8 తదితర అంశాలపై మాట్లాడటమే కాకుండా ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకులు మాట్లాడాలి.

మహేష్ ఆ దర్శకుడితో సినిమా చేస్తాడా...?

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటుంటారు. మహేష్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా, భారీ బడ్జెట్ మూవీ చేద్దామా?

సూపర్ సందడిగా 'సినిమా చూపిస్త మావ' సాంగ్స్ రిలీజ్

‘ఉయ్యాలా జంపాలా’ జంటగా రాజ్ తరుణ్`అవికాగోర్ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ పాటు హైద్రాబాద్ లోని శ్పికళావేదికపై అత్యంత సందడిగా నిర్వహించిన కార్యక్రమంలో విడుదయ్యాయి.

'యూత్ ఫుల్ లవ్' మూవీ రివ్యూ

ఇప్పుడున్న సినిమాల ట్రెండ్ ఒకటి లవ్, రెండు హర్రర్. అందులో లవ్ విషయానికి వస్తే ప్రేమలో గొప్పతనాన్ని చూపిస్తూ కేవలం కొన్ని పాత్రల చుట్టూ తిరిగే ప్రేమకథలు వస్తుంటే, ప్రేమతో పాటు జీవితం, సమాజం కూడా ముఖ్యమని చెప్పే ప్రేమకథలు వస్తున్నాయి. ఇలా రెండో కోవకు చెందిన చిత్రమే యూత్ ఫుల్ లవ్.