క్రిష్ కంచె కి జాతీయ అవార్డ్ - ఆనందంలో వ‌రుణ్ తేజ్..

  • IndiaGlitz, [Monday,March 28 2016]

గ‌మ్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అభిరుచిగ‌ల ద‌ర్శ‌కుడు క్రిష్. గ‌మ్యం ఆత‌ర్వాత‌ వేదం, కృష్ణ‌మ్ వందేజ‌గ‌ద్గురుమ్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన క్రిష్ తాజా చిత్రం కంచె. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంతో తెర‌కెక్కిన కంచె చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది.

అంతే కాకుండా క‌మ‌ర్షియ‌ల్ గా కూడా మంచి విజ‌యాన్ని సాధించిన కంచె సినిమా ఇప్పుడు ఉత్త‌మ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. కంచె సినిమాకి జాతీయ అవార్డు రావ‌డంపై కంచె హీరో వ‌రుణ్ తేజ్ స్పందిస్తూ...జాతీయ స్ధాయిలో ఉత్త‌మ తెలుగు చిత్రం అవార్డ్ సాధించిన కంచె సినిమాలో న‌టించ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేస్తూ..కెప్టెన్ క్రిష్ కి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేసాడు. మెగా హీరో వ‌రుణ్ తేజ్ రెండో సినిమానే జాతీయ స్ధాయిలో అవార్డు సాధించే విభిన్న క‌థా చిత్రాన్ని ఎంచుకోవ‌డం విశేషం.

More News

63వ జాతీయ అవార్డు వివ‌రాలు..

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి. ప్ర‌భాస్, అనుష్క, త‌మ‌న్నా, రానా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రం 600 కోట్లు వ‌సూలు చేసిన విష‌యం తెలిసిందే.

త‌మ‌న్నా స‌క్సెస్ చూసి బాధ‌ప‌డుతున్న శృతిహాస‌న్..

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా క‌ల‌సి న‌టించిన చిత్రం ఊపిరి. ఈ సినిమా త‌మిళ్ లో తోళా అనే టైటిల్ తో రిలీజైంది. ఈ సినిమా ఇటు తెలుగు - అటు త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించింది.

బాహుబ‌లి జాతీయ అవార్డ్ గురించి నిర్మాత శోభు ఏమ‌న్నారంటే...

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ - అందాలతార అనుష్క - రానా కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఒక ప్రాంతీయ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం విశేషం.

సునీల్ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క్వంలో సినిమా ప్రారంభం

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. సురేష్ బాబు తొలి స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా క్రాంతి మాద‌వ్ గౌరవ ద‌ర్శ‌క‌త్వంలో సునీల్‌, మియా హీరో హీరోయిన్లుగా యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ ప‌తాకంపై నూత‌న చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్ దైవ‌స‌న్నిధానంలో ప్రారంభ‌మైంది. క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌కుడు. ప‌రుచూరి కిరిటీ ఈ చిత్

శ్రియ ఉంటే హిట్టే..

కథానాయికగా 15ఏళ్ల ప్రయాణం ఆమెది.అయినా ఇప్పటికీ అదే ఫిట్ నెస్.అదే గ్లామర్.