అందుక‌నే...కంచె సినిమాను కూడా ఆద‌రిస్తార‌ని నా న‌మ్మ‌కం - వ‌రుణ్ తేజ్

  • IndiaGlitz, [Wednesday,October 21 2015]

ముకుంద సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు హీరో వ‌రుణ్ తేజ్. తొలి చిత్రానికి విభిన్న క‌థ‌ను ఎంచుకున్న వ‌రుణ్ తేజ్ రెండో సినిమా కంచెకు కూడా వైవిధ్య‌మైన క‌ధాంశాన్నేఎంచుకున్నాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ కంచె సినిమాలో న‌టించారు. ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా ఈనెల 22న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా కంచె గురించి క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం..

ముకుంద లో మీ క్యారెక్ట‌రైజేష‌న్ డిఫ‌రెంట్..కంచెలోకూడా క్యారెక్ట‌రైజేష‌న్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. ఫ‌స్ట్ మూవీ, సెకండ్ మూవీ క్యారెక్ట‌రైజేష‌న్లో డిఫ‌రెన్స్ చూపించాల‌నే ఈ క‌థ‌ను ఎంచుకున్నారా..?

నేను ఈ సినిమాను సెలెక్ట్ చేసుకోవ‌డానికి కార‌ణం ఈ క‌థ‌లో ఉన్న కంటెంట్...క్యారెక్ట‌రైజేష‌న్ కాదు. కంచె సినిమా నేప‌ధ్యం సెకండ్ వ‌ర‌ల్డ్ వార్..అందులోను మంచి ల‌వ్ స్టోరి ఉంది. ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళు మ‌న‌ల్ని తీసుకెళ్లి జ‌ర్మ‌నీకి వ్య‌తిరేకంగా యుద్ధం చేయించిన‌ప్పుడు ఓ సోల్జ‌ర్ క‌థ ఎలా ఉంటుందో కంచె లో చూపించాం.ఇది చాలా కొత్త కాన్సెప్ట్. క‌థ విన్న వెంట‌నే చాలా ఎక్సైట్ అయ్యాను.అందుక‌నే కంచె సినిమా చేసాను.

ఈ సినిమాలో మీ బాడీ లాంగ్వేజ్ కూడా కొత్త‌గా ఉంది. ఒక సినిమా ఎక్స్ పీరియ‌న్స్ తో మిమ్మ‌ల్ని మీరు ఎలా మార్చుకున్నారు..?

దూపాటి హ‌రిబాబు, కెప్టెన్ దూపాటి హ‌రిబాబు ఈ రెండింటికీ బాడీ లాంగ్వేజ్ లో డిఫ‌రెన్స్ చూపించాలి. అయితే డైరెక్ట‌ర్ క్రిష్..చాలా కేర్ తీసుకుని..నేను ఎలా చేస్తే బాగుంటుందో చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ట్టు నేను చేసాను. ఆయ‌న బాగా చేసావ్ అన్నారు. ఇంక సినిమా చూసాకా..నేను ఎలా చేసానో ఆడియ‌న్స్ చెప్పాలి. నేనైతే ఆపాత్ర‌కు న్యాయం చేయ‌డానికి ప్ర‌య‌త్నించాను.

ఈ క్యారెక్ట‌ర్ గురించి తెలుసుకోవ‌డానికి ఎవ‌ర్నైనా క‌ల‌వ‌డం జ‌రిగిందా..?

ఈ సినిమా గురించి ఎవ‌ర్ని క‌ల‌వ‌లేదు కానీ...సెకండ్ వ‌ర‌ల్డ్ వార్ పై హాలీవుడ్ లో చాలా సినిమాలు వ‌చ్చాయి. అవి చూసి నేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాం. సోల్జ‌ర్ అంటే..1940 అయినా 50 అయినా 2015 అయినా సోల్జ‌ర్ అన‌గానే కామ‌న్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది క‌త్తిలా నిల‌బ‌డ‌డం..మాట‌లు కూడా ఏమాత్రం త‌డ‌బ‌డ‌కుండా మాట్లాడ‌డం...ఇవ‌న్నీ తెలుసుకున్నాను. అలాగే క్రిష్ ఎక్స్ ఆర్మీ ఆఫీస‌ర్ ని తీసుకువ‌చ్చారు. వారం రోజులు పాటు ఆయ‌న మాకు క్యాంప్ లా ఏర్పాటు చేసి సోల్జ‌ర్ ఎలా న‌డుస్తారు..మార్చ్ ఎలా చేస్తారు..ఎంత సీరియ‌స్ గా ఉంటారు...ఎలా మాట్లాడుతారు..సెల్యూట్ ఎలా కొడ‌తారు...ఇలా ఎన్నో విష‌యాలు చెప్పారు. సినిమా చూస్తున్న‌ప్పుడు కెప్టెన్ హ‌రిబాబులా లేడు అనిపిస్తే...డిస్ క‌నెక్ట్ అనేది వ‌స్తుంది. అందుక‌ని ఆడియోన్స్ క‌నెక్ట్ అయ్యేలా న‌టించాను. సినిమా చూసి మా యూనిట్ బాగా చేసావ్ అంటున్నారు..ఆడియోన్స్ ఏమంటారో చూడాలి.

కంచె సినిమా నుంచి మీరు నేర్చుకుంది ఏమిటి..?

సినిమా కొర‌కు క్యారెక్ట‌ర్ ప‌రంగా ఎంత వ‌ర‌కు నేర్చుకున్నానో అంత వ‌ర‌కే చేస్తాను. మ‌రి ఎక్కువుగా ఆ క్యారెక్ట‌ర్ గురించి మైండ్ లో పెట్టుకుంటే నా నెక్ట్స్ సినిమాకి ప్రాబ్ల‌మ్ అవుతుంది. పూరి గారితో చేస్తున్న లోఫ‌ర్ సినిమాలో దూపాటి హ‌రిబాబులా ఉండ‌లేను. లోఫ‌ర్ సినిమాలో లోఫ‌ర్ లా ఉండాలి.

క్రిష్ క‌థ చెప్పిన‌దానికి..సినిమాగా తెర‌కెక్కించ‌డానికి ఏమైనా తేడా ఉందా..?

క్రిష్ క‌థ చెప్పిన దానికంటే సినిమా బాగా తీసాడు. క‌థ చెప్పిన‌ప్పుడు ఎంత‌గానో న‌చ్చింది. కానీ ఎక్క‌డో చిన్న భ‌యం. రెండవ ప్ర‌పంచ యుద్ధం నాటి నేప‌ధ్యాన్ని మ‌నం ఖ‌చ్చితంగా చూపించ‌గ‌ల‌మా...? మ‌న‌కున్న బ‌డ్జెట్ లో తీయ‌గ‌ల‌మా..? అనే సందేహం ఉండేది. కానీ..క్రిష్ మాత్రం చేయ‌గ‌ల‌మ‌ని కాన్ఫిడెంట్ గా చెప్పేవాడు. మా టీమ్ అంతా చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. సినిమా ర‌షెష్ చూసి మ‌న సినిమాయేనా ఇది..ఇంత బాగా చేసామా అనిపించింది.

కంచె సినిమా చేయాల‌నుకుంటున్న‌ప్పుడు నాన్న‌గారు ఏమ‌న్నారు..? వ‌ద్ద‌ని ఎవ‌రైనా చెప్పారా..?

ఈ క‌థ ఫ‌స్ట్ నాన్న‌గారు విన్నారు. పెద‌నాన్న గారికి పూర్తి క‌థ తెలియ‌క‌పోయినా...కాన్సెప్ట్ తెలుసు. చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. మంచి సినిమా అవుతుంది చేయ‌మ‌న్నారు.చ‌ర‌ణ్ అన్న‌కి కొంచెం క‌థ తెలుసు. వ‌రుణ్‌..అంద‌రికీ ఇలాంటి అవ‌కాశం రాదు. ఈ సినిమా చేయి.. కెరీర్ బిగినింగ్ లోనే ఇలాంటి సినిమా చేయ‌డం మంచిద‌ని చ‌ర‌ణ్ అన్న‌ అన్నాడు. ఒక ర‌కంగా ఈ సినిమా చేయ‌డానికి చ‌ర‌ణ్ అన్న‌కూడా ఒక కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు.

హీరోయిన్ ప్ర‌గ్యా గురించి..?

ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ కి రాయ‌ల్ లుక్ ఉండాలి... అయితే హీరోయిన్ క్యారెక్ట‌ర్ ఎవ‌రు చేస్తారు అనుకుంటున్న‌ప్పుడు ఓ ఫోటో చూపించారు. ఆత‌ర్వాత ఫోటో షూట్ చేసి ప్ర‌గ్యాని క‌న్ ఫ‌ర్మ్ చేసారు. అయితే సీతాదేవి క్యారెక్ట‌ర్ ను కొత్త అమ్మాయి స‌రిగా చేస్తుందా...క్యారెక్ట‌ర్ లో ఉన్న డెప్త్ అర్ధం చేసుకుంటుందా.. అనుకున్నాను. పైకి స‌ర‌దాగా క‌నిపిస్తుంది కానీ..వ‌ర్క్ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి చాలా డేడికేటేడ్ గా చేస్తుంది. ప్ర‌గ్యా డైలాగ్స్ చెబుతుంటే నేనే స‌ర్ ఫ్రైజ్ అయ్యాను. తెలుగు అమ్మాయిలానే అనిపించింది.

ప్ర‌జెంట్ ఆడియోన్స్..రిలీఫ్ కోస‌మే ధియేట‌ర్స్ కి వ‌స్తున్నారు. ఇలాంటి టైంలో కంచె ఆడియోన్స్ ధియేట‌ర్స్ కి ఎంత వ‌ర‌కు ర‌ప్పించ‌గ‌ల‌దు..?

కంటెంట్ కొత్త‌గా ఉంటే సినిమాను చూస్తున్నారు. బాహుబ‌లి, శ్రీమంతుడు..ఈ రెండు 100% క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ కాదు. అయినా కొత్త‌గా ఉంది క‌నుక ఆడియోన్స్ ఎక్స్ ఫ్ట్ చేసారు. అలాగే కొత్త‌గా ఉండే కంచె సినిమాను కూడా ఆద‌రిస్తార‌ని నా న‌మ్మ‌కం. కంచె ట్రైల‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. క‌థ కొత్త‌గా ఉంటే జోన‌ర్ ఏదైనా చూస్తారు.కంచె ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ముకుంద‌ క‌న్నా..ఎక్కువుగా ఈ సినిమా గురించి న‌న్ను అడుగుతున్నారు. దీన‌ని బ‌ట్టి ఖ‌చ్చితంగా కంచె ఆడియోన్స్ ను ధియేట‌ర్స్ కి ర‌ప్పిస్తుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు.

ఫ్యాన్స్ కు న‌చ్చేలా సినిమాలు తీయాల‌నుకుంటారా..? లేక‌ మీకు న‌చ్చేలా సినిమాలు తీయాల‌నుకుంటారా..?

అది ఆయా ఎక్ట‌ర్ ను పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఫ్యాన్స్ కు న‌చ్చేలా సినిమాలు తీసి స‌క్సెస అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ల‌కు న‌చ్చిన సినిమాలు తీసి స‌క్సెస్ అయిన వాళ్లు ఉన్నారు. రెండూ క‌రెక్టే అని నా అభిప్రాయం. ర‌జ‌నీకాంత్, పెద‌నాన్న వాళ్ల ఫ్యాన్స్ కి ఎలాంటి సినిమా కావాలో..అలాంటి సినిమా తీసి స‌క్సెస్ అయి... నెంబ‌ర్ వ‌న్ అయ్యారు. అలాగే బాబాయ్ కూడా. ఫ్యాన్స్ కు న‌చ్చేలా ఉండాల‌న్నా..క‌థ బాగుండాలి క‌థ బాగుండ‌డం వ‌ల‌నే శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్, అత్తారింటికి దారేది..హిట్ అయ్యాయి.

మీ ఫ్యామిలీ నుంచి మీ సిస్ట‌ర్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏమిటి..?

మా సిస్ట‌ర్ నిహారిక హీరోయిన్ గా న‌టిస్తానంటే...ఎంత మంది వద్ద‌న్నా...ఎంక‌రేజ్ చేయ‌మ‌ని నాతో చాలా మంది చెప్పారు. ఒక సినిమాకి హీరో, డైరెక్ట‌ర్ ఎంత ముఖ్య‌మో. హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా చాలా త‌క్కువ మంది ఉన్నారు. ఏదో హీరోయిన్ గా చేయాల‌ని నిహారిక చేయ‌డం లేదు.నిహారిక‌కి ఏక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఖ‌చ్చితంగా మేము స‌పోర్ట్ చేస్తాం.

బ్రూస్ లీ సినిమాను చూసారా..?

కంచె బిజీలో ఉండి బ్రూస్ లీ చూడ‌లేదు. కానీ పెదనాన్న న‌టించిన సీన్స్ చూడ‌డానికి రిలీజ్ వ‌ర‌కు ఆగ‌లేక‌పోయాను. అందుచేత రిలీజ్ కి ముందే బ్రూస్ లీ లో పెద‌నాన్న సీన్స్ చూసాను. పెద‌నాన్న సినిమాలు మానేసి రాజ‌కీయాల్లోకి వెళ‌తాను అన్న‌ప్పుడు ఇంట్లోకి వెళ్లి త‌లుపులు వేసుకుని ఏడ్చేసాను. మ‌ళ్లీ పెద‌నాన్న‌ను స్ర్కీన్ పై చూడ‌నా..అని పోలిటిక్స్ లోకి వెళ్ల‌ద్ద‌ని చెప్పాను. ఇప్పుడు బ్రూస్ లీ న‌టించ‌డం ఆనందంగా ఉంది. పెద‌నాన్న స్ర్కీన్ పై చూడ‌గానే థియేట‌ర్లో ఒక‌టే విజుల్స్ అని విన్నాను.నేను థియేట‌ర్లో చూసుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడిని.

మెగా ఫ్యామిలీ హీరోల్లో మ‌ల్టీస్టార‌ర్ చేస్తే...ఎవ‌రెవ‌రితో చేస్తే బాగుంటుంద‌నుకుంటున్నారు..?

చ‌ర‌ణ్ తో ఇటీవ‌ల ఇదే విష‌యం గురించి మాట్లాడాను. చ‌ర‌ణ్‌..నువ్వు, నేను తేజు..క‌ల‌సి చేద్దాం అన్నాడు. అయినా క‌థ కుద‌రాలి. బాబాయ్ తో క‌ల‌సి న‌టించాలంటే నాకు భ‌యం. కానీ పెద‌నాన్న‌తో క‌ల‌సి ఓ యాడ్ లో న‌టించాను.

లోఫ‌ర్ సినిమాతో మీ ఇమేజ్ మారుతుందా..?

ముకుంద లో క్యారెక్ట‌ర్ ఓ ర‌కంగా ఉంటే..కంచెలో మ‌రోలా ఉంటుంది. లోఫ‌ర్ లో అయితే చాలా ఎన‌ర్జిటిక్ గా ఉంటుంది. ఓ లోఫ‌ర్ ఎలా ఉంటాడో అలా ఉంటుంది.నాలో కొత్త యాంగిల్ లోఫ‌ర్ చూస్తారు. మంచి క‌మ‌ర్షియ‌ల్ మూవీ అవుతుంది.

మీరు వ‌ర్క్ చేసిన‌ ముగ్గురు ద‌ర్శ‌కుల గురించి ఒక్క‌మాట‌లో చెప్ప‌మంటే..?

శ్రీకాంత్ అడ్డాల చిన్నోడే కానీ..పెద్ద త‌ర‌హాలో...మా నాన్న‌గారు ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నాడు. క్రిష్ అయితే ఎప్పుడూ.. ఏదో సినిమా గురించి ఆలోచిస్తుంటాడు. ఏదో కొత్త‌ది చెప్పాల‌ని ట్రై చేస్తుంటాడు.ఇక‌ పూరి గారి గురించి చెప్పాలంటే..చిరుత టైంలో నేను డైరెక్ట‌ర్ అవుతానేమో అనుకుని నాన్న‌గారు వెళ్లి పూరి గార్ని క‌ల‌వ‌మ‌న్నారు. అప్పుడు వెళ్లి పూరి గార్ని క‌లిసాను. శ్రీకాంత్ అడ్డాల‌, క్రిష్ వీళ్లిద్ద‌రితో క‌న్నా ఎక్కువుగా పూరి గారితో ఫ్రీగా ఉంటాను. ఆయ‌నతో ఉంటే పెద్ద డైరెక్ట‌ర్ అని ఫీలింగ్ అనిపించ‌దు.ఆయ‌న స్టైలే వేరు.

నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..

ముకుంద‌, కంచె, లోఫ‌ర్..ఇలా మూడు డిఫ‌రెంట్ మూవీస్ చేసాను. ప్ర‌స్తుతం డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి.ఏ సినిమా చేసేది త్వ‌ర‌లోనే చెబుతాను. అయితే నెక్ట్స్ ఏ సినిమా చేసినా క‌థ కొత్త‌గా ఉండాల‌నుకుంటాను.