ఊటీలో మిస్టర్ వరుణ్ తేజ్ కు గాయాలు..!
- IndiaGlitz, [Friday,September 30 2016]
మెగా హీరో వరుణ్ తేజ్ మిస్టర్, ఫిదా చిత్రాల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల ఫిదా చిత్రాన్ని తెరకెక్కిస్తుంటే, శ్రీను వైట్ల మిస్టర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఫిదా చిత్రం షూటింగ్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ తాజాగా మిస్టర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ చిత్ర కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుంటే వరుణ్ తేజ్ కి గాయాలు అవ్వడంతో పాటు కుడి కాలు బెణికింది. దీంతో వరుణ్ తేజ్ ఊటీలోని హాస్పటల్ కి వెళ్లి ప్రాధమిక చికిత్స చేయించుకున్నాడు. అనంతరం హాస్పటల్ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ పై క్లోజ్ అప్ సీన్స్ చిత్రీకరించారు. అయితే...డాక్టర్స్ ఆరు వారాలు విశ్రాంతి తీసుకోమని సూచించడంతో....ఇప్పుడే వరుణ్ తేజ్ హైదరాబాద్ బయలుదేరారని సమాచారం.