రెండు పాత్ర‌ల్లో వ‌రుణ్ తేజ్‌

  • IndiaGlitz, [Monday,March 26 2018]

'ఫిదా'తో తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్నారు యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్‌. ఆ త‌రువాత 'తొలి ప్రేమ‌'తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు వ‌రుణ్‌. ప్ర‌స్తుతం 'ఘాజీ' ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పేస్ మూవీని చేస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీని చేయ‌నున్నారు.

దీంతో పాటు.. 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు వ‌రుణ్ తేజ్‌. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాలో వ‌రుణ్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌ని తెలిసింది.

ఇప్ప‌టివ‌ర‌కు రెండు పాత్ర‌ల్లో వ‌రుణ్ క‌నిపించిన సంద‌ర్భాలు లేవు. మ‌రి.. తొలిసారిగా డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్న ఈ యువ క‌థానాయ‌కుడు.. ఇందులో ఎలాంటి పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌నేదానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది. మొత్త‌మ్మీద‌.. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తున్న ఈ యంగ్ హీరో.. రానున్న ఏడాది కాలంలో ముచ్చ‌ట‌గా మూడు సినిమాల‌తో ప‌ల‌క‌రించనున్నార‌న్న‌మాట‌.