సంక్రాంతి రేసులో వరుణ్ తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మా అమ్మ మహాలక్ష్మి. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లాస్ట్ డే షూటింగ్ ఈరోజు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ దిషా పటాని, బ్రహ్మానందం, ఆలీ, ముకేష్ రుషి, సప్తగిరి తదితరులపై ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మా అమ్మ మహాలక్ష్మి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దసరా సీజన్ లో కంచెతో సక్సెస్ సాధించిన వరుణ్ తేజ్ సంక్రాంతి సీజన్ లో కూడా సక్సెస్ సాధిస్తాడని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com