మెగా హీరోకే ఏక్టింగ్ నేర్పుతున్న శేఖర్ కమ్ముల....

  • IndiaGlitz, [Friday,July 08 2016]

ఆనంద్, గోదావ‌రి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్...ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను అందించిన శేఖ‌ర్ క‌మ్ముల తాజాగా వ‌రుణ్ తేజ్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ చిత్రం కోసం శేఖ‌ర్ క‌మ్ముల ఏక్టింగ్ వ‌ర్క్ షాప్ స్టార్ట్ చేసారు.
ఈ ఏక్టింగ్ వ‌ర్క్ షాప్ లో హీరో వ‌రుణ్ తేజ్, హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వ‌రుణ్ తేజ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...నా నెక్ట్స్ మూవీ కోసం ఏక్టింగ్ వ‌ర్క్ షాప్ లో పాల్గొన్నాను. చాలా ఎక్సైట్ అయ్యాను అంటూ వ‌ర్క్ షాప్ వ‌ర్కింగ్ స్టిల్ కూడా పోస్ట్ చేసాడు. మెగా హీరోల‌కు ఏక్టింగ్ అనేది బ్ల‌డ్ లోనే ఉంటుంది. మ‌రి...మెగా హీరోకే ఏక్టింగ్ నేర్పుతున్న శేఖ‌ర్ క‌మ్ముల వ‌రుణ్ తేజ్ ని ఎలా చూపిస్తాడో..? వ‌రుణ్ నుంచి ఎలాంటి న‌ట‌న‌ను బ‌య‌ట‌కు తీస్తాడో చూడాలి.

More News

రామెజిఫిల్మ్ సిటి లో చివరి పాట చిత్రీకరణ జులై 22న సునీల్ 'జక్కన్న' విడుదల

సునీల్ హీరోగా,మన్నార్ చోప్రా హీరోయిన్ గా,ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న

జనతా గ్యారేజ్ ఆడియో వేడుక - వేదిక ఖరారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్.

చిరు సినిమాలో బన్ని భామ....

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తమిళ చిత్రం కత్తి రీమేక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ప్ర‌భాస్ న్యూమూవీ టైటిల్ ఇదా..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో మిర్చి చిత్రాన్ని నిర్మించిన యు.వి. క్రియేష‌న్స్ సంస్థ ప్ర‌భాస్ తో రెండు చిత్రాల‌ను నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తుంది. ఇందులో ఒక చిత్రానికి ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిరాహార దీక్ష చేస్తున్న హీరో..

హైద‌రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిరాహార దీక్ష చేస్తున్న హీరో ఎవ‌రునుకుంటున్నారా..?  లాహిరి లాహిరి లాహిరిలో..., ధ‌న‌ల‌క్ష్మి ఐ ల‌వ్ యు త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన ఆదిత్యా ఓం.