ప్రభాస్‌తో వరుణ్‌తేజ్ హీరోయిన్..?
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్‌తేజ్‌తో లోఫర్ సినిమాలో జోడీ కట్టిన ముద్దుగుమ్మ దిశాపటాని ఇప్పుడు ప్రభాస్‌తో జత కట్టనుందా? అంటే అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ప్రభాస్ నాలుగు ప్యాన్ ఇండియా సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులోరాధేశ్యామ్ సెట్స్‌పై ఉంది. మిగిలిన మూడు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. మరి ఈ మూడింటిలో ఎందులో దిశా పటాని నటిస్తుందని సందేహాలు రాకమాదు.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా హోంబలే నిర్మిస్తోన్న చిత్రం సలార్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దిశాపటాని నటించనుందని టాక్. ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదో లేక వద్దనుకుందో ఏమో కానీ.. లోఫర్ సినిమా తర్వాత దిశాపటాని బాలీవుడ్‌కే పరిమితమైంది. ఎట్టకేలకు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాతో దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగక తప్పదు.
సలార్ సినిమా జనవరి నుండి సెట్స్‌పై వెళ్లనుంది. వచ్చే ఏడాదిలోనే సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. రాధేశ్యామ్ తర్వాత ఈ సినిమాను విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి నటీనటుల కోసం ఆడిషన్ కాల్ కూడా ఇచ్చారు. ఈ డిసెంబర్ 15న హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడిషన్స్ జరగనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments