మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్?
Send us your feedback to audioarticles@vaarta.com
'ఫిదా', 'తొలిప్రేమ' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు 'ఘాజీ' ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అంతరిక్ష నేపథ్యంతో సాగే ఈ సినిమాలో వరుణ్ వ్యోమగామిగా కనిపించనున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. 'అయ్యారే', 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాల దర్శకుడు సాగర్ చంద్ర ఇటీవల వరుణ్‌కు ఓ కథను చెప్పారని.. ఆ కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్‌కు కూడా వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.
తుది మెరుగులు దిద్దుకున్న తర్వాత మరోసారి ఫైనల్ సిట్టింగ్‌లో స్క్రిప్ట్‌ను ఓకే చేసుకుని.. ఆ తరువాత అధికారికంగా వివరాలను వెల్లడించనున్నారని సమాచారం. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com