భీమ్లా నాయక్ ఎఫెక్ట్ : మరోసారి వాయిదాపడ్డ వరుణ్ తేజ్ ‘‘గని’’ .. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Tuesday,February 22 2022]

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. వకిలీసాబ్ తర్వాత పవన్ నటించిన సినిమా కావడం.. పైగా మల్టీస్టారర్ అవ్వడంతో భీమ్లా నాయక్‌పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. భీమ్లా బరిలోకి దిగుతుండటంతో ఫిబ్రవరి 25కి ముందు వెనుక రిలీజ్‌లు పెట్టుకున్న సినిమా నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. దీంతో కొన్ని సినిమా విడుదలలు వాయిదాపడుతున్నాయి. ఇప్పటికే శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా వాయిదా పడింది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ నటించింది. భీమ్లా ఎఫెక్ట్‌తో ఈ సినిమా మార్చి 4కు వెళ్లింది.

తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘‘గని’’ కూడా వాయిదాపడింది. ఈపాటికే విడుదలకావాల్సిన ఈ సినిమా కొవిడ్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తర్వాత పరిస్ధితులు కుదుటపడటంతో ఫిబ్రవరి 25న లేదా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఫిబ్రవరి 25ని ఫిక్స్ చేశారు కూడా. అదే రోజున ‘భీమ్లా నాయక్‌’ వస్తుండటంతో గని మరోసారి వాయిదాపడక తప్పలేదు. పవన్‌ కల్యాణ్‌ అభిమానుల్లానే తామూ ‘భీమ్లా నాయక్‌’ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని... కొత్త విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ‘‘గని’’ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అల్లు అరవింద్ సమర్పకుడిగా.. అల్లు బాబీ కంపెనీ, రినైస్సన్స్ పిక్చర్స్ పతాకాల‌పై ‘‘గని’’ని సిద్ధు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

More News

త్రివిక్రమ్‌పై వ్యాఖ్యలు.. ఆ వాయిస్ నాది కాదు: ఆడియో టేప్‌ వివాదంపై బండ్ల గణేశ్  క్లారిటీ

నిర్మాత, సినీనటుడు బండ్ల గణేశ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్

సమంతా నువ్వు ప్రెగ్నెంటా.. లేకపోతే నన్ను చేయమంటావా..!!

అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో వుండేందుకు గాను సినీ తారలు సోషల్ మీడియాలో ఖాతాలు తెరుస్తున్నారు.

‘‘ నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలికి వస్తే కష్టం’’ : భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసిందిగా

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది.

NBK107 : బ్లాక్ డ్రెస్‌లో .. మాస్‌లుక్‌లో నటసింహం, ఫ్యాన్స్‌కు పూనకాలే

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో మంచి జోష్‌లో వున్నారు

మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణం.. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌, రానా నటించిన మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్‌’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్‌లో జరగాల్సి వుంది.