వరుణ్ తేజ్.. ఈ ఏడాది కూడా అలాగే!
Send us your feedback to audioarticles@vaarta.com
2014లో విడుదలైన ముకుంద చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్.. ఈ మూడున్నరేళ్ళ కాలంలో ఆరు చిత్రాలతో సందడి చేశాడు. 2014లో ఒక సినిమాతోనే సరిపెట్టిన వరుణ్.. 2015లో కంచె, లోఫర్ చిత్రాలతో సందడి చేశాడు. 2016లో అతని నుంచి ఒక్క సినిమా రాలేదు. మళ్ళీ 2017లో మిస్టర్, ఫిదా చిత్రాలతో సందడి చేశాడు.
ఈ ఏడాది కూడా 2015, 2017 మాదిరిగానే రెండు సినిమాలతో పలకరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు వరుణ్. ఇప్పటికే తొలిప్రేమ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్.. ఈ ఏడాది చివరలో మరో సినిమాతో సందడి చేయనున్నాడు. ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో చేస్తున్న ఆ చిత్రం.. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో వ్యోమగామి పాత్రలో కనిపించనున్నాడు ఈ మెగా హీరో. మొత్తమ్మీద.. ఏడాదికి ఓ చిత్రంతో సరిపెట్టుకోకుండా కనీసం రెండు సినిమాలు ఉండేలా వరుణ్ చేస్తున్న ప్రయత్నం అభినందించదగ్గదే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments