వరుణ్ తేజ్.. ఈ ఏడాది కూడా అలాగే!

  • IndiaGlitz, [Friday,February 23 2018]

2014లో విడుద‌లైన ముకుంద చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన మెగా హీరో వ‌రుణ్ తేజ్‌.. ఈ మూడున్న‌రేళ్ళ‌ కాలంలో ఆరు చిత్రాల‌తో సంద‌డి చేశాడు. 2014లో ఒక సినిమాతోనే స‌రిపెట్టిన వ‌రుణ్‌.. 2015లో కంచె, లోఫ‌ర్ చిత్రాల‌తో సంద‌డి చేశాడు. 2016లో అత‌ని నుంచి ఒక్క సినిమా రాలేదు. మ‌ళ్ళీ 2017లో మిస్ట‌ర్, ఫిదా చిత్రాల‌తో సంద‌డి చేశాడు.

ఈ ఏడాది కూడా 2015, 2017 మాదిరిగానే రెండు సినిమాల‌తో ప‌ల‌కరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు వ‌రుణ్‌. ఇప్ప‌టికే తొలిప్రేమ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన వ‌రుణ్‌.. ఈ ఏడాది చివ‌ర‌లో మ‌రో సినిమాతో సంద‌డి చేయనున్నాడు. ఘాజీ ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డితో చేస్తున్న ఆ చిత్రం.. అంత‌రిక్షం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఇందులో వ్యోమ‌గామి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు ఈ మెగా హీరో. మొత్త‌మ్మీద‌.. ఏడాదికి ఓ చిత్రంతో స‌రిపెట్టుకోకుండా క‌నీసం రెండు సినిమాలు ఉండేలా వ‌రుణ్ చేస్తున్న ప్ర‌య‌త్నం అభినందించ‌ద‌గ్గ‌దే.

More News

నితిన్ కు మరోసారి కలిసొస్తుందా?

కథానాయకుడిగా నితిన్ ప్రయాణం మొదలై 16 ఏళ్ళు అవుతోంది.

పూజా.. పండగలే టార్గెట్

పూజా హెగ్డే..ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.

నాగచైతన్య.. ఐదో సారి

కొందరికి కొన్ని నెలలు భలేగా కలిసొస్తాయి.అలా యువ కథానాయకుడు నాగచైతన్యకి కూడా ఓ నెల బాగా అచ్చొచ్చిందనే చెప్పాలి.

సాయిధరమ్ చిత్రంలో ఆ పాత్ర ప్రత్యేకమట

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్,

'వంశధార క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1' ప్రారంభోత్సవం

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా యువ ప్రతిభాశాలి శ్రీనివాస్ దర్శకత్వంలో