వరుణ్ తేజ్‌కిదే తొలిసారి..
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలను చెప్పుకోవచ్చు. మరి అటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తున్న హీరో అంటే.. ఆ ఎంట్రీ ఫిల్మ్ ఇంకెంత గ్రాండ్‌గా ఉంటుందో వేరేగా చెప్పనక్కరలేదు.
కాని మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మాత్రం ఇందుకు భిన్నంగానే సినిమాలను చేస్తూ వస్తున్నారు. 'ముకుంద' లాంటి కూల్ పిక్చర్తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ హీరో.. 'కంచె' సినిమాతో తాను వైవిధ్యభరితమైన చిత్రాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సిగ్నల్స్ ఇచ్చేసారు.
ఈ క్రమంలోనే 'ఫిదా', 'తొలిప్రేమ' లాంటి చిత్రాలతో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో కలిసి 'ఎఫ్2' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదల కానుంది.
ఇంతవరకు సంక్రాంతి విజయాలను సొంతం చేసుకున్న మెగా హీరోల సినిమాలను ఒకసారి పరిశీలిస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'దొంగమొగుడు', 'మంచి దొంగ', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'హిట్లర్', 'అన్నయ్య','ఖైదీ నంబర్ 150' తదితర సినిమాలు సంక్రాంతి విజయాలుగా నిలిచాయి.
అలాగే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'దేశముదురు', 'ఎవడు' లాంటి సినిమాలతోనూ, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'నాయక్', 'ఎవడు' చిత్రాలతోనూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గోపాలా గోపాల' మూవీతోనూ సంక్రాంతి విజయాలను చూసినవారే. ఇప్పుడు వీరి సరసన చేరడానికి 'ఎఫ్2' చిత్రంతో కెరీర్లో తొలిసారిగా సంక్రాంతి బరిలో దిగుతున్నారు మెగా హీరో వరుణ్ తేజ్.
మరి అందరి మెగా హీరోల్లాగే ఈ మెగా హీరో కూడా సంక్రాంతి విజయాన్ని నమోదు చేస్తారేమో చూడాలి. అన్నట్టు.. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com