వరుణ్ తేజ్ ఫిదా ప్రారంభమైంది...
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శేఖర్ కమ్ముల దర్శకమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న కొత్త చిత్రం ఫిదా. ఈ సినిమా శుక్రవారం నిజామాబాద్ బాన్స్వాడలో లాంచనంగా ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి మంత్రి పోచారం శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరోయిన్ సాయిపల్లవిపై దర్శకుడు శేఖర్ కమ్ముల క్లాప్ కొట్టారు. ఎన్.ఆర్.ఐ కుర్రాడికి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫి విజయ్ కుమార్, సంగీతం శక్తి కాంత్ అందిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments