వరుణ్ తేజ్ డ్రీమ్ రోల్ ఇదే..

  • IndiaGlitz, [Monday,October 26 2015]

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ ముకుంద సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...కంచె సినిమాతో న‌టుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. దూపాటి హ‌రిబాబు పాత్ర‌లో వ‌రుణ్ తేజ్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా అద్భుతంగా న‌టించాడ‌ని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంటున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో లోఫ‌ర్ సినిమాతో అల‌రించ‌డానికి డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

ఇదిలా ఉంటే..వ‌రుణ్ తేజ్ కి హాలీవుడ్ మూవీస్ టెర్మినేట‌ర్, సూప‌ర్ మేన్ అంటే చాలా ఇష్టమ‌ట‌. ఈ సినిమాల‌ను వంద‌సార్లు చూసుంటాను అంతిష్టం ఈ సినిమాలంటే. ఎప్ప‌టికైనా సూపర్ మేన్ లా న‌టించాల‌ని ఉంది. ఇదే నా డ్రీమ్ రోల్ అంటూ మంచు ల‌క్ష్మి చేస్తున్న ఓ గేమ్ షోలో త‌న మ‌న‌సులో మాట చెప్పాడు వ‌రుణ్ తేజ్. మ‌రి..వ‌రుణ్ తేజ్ కి డ్రీమ్ రోల్ చేసే అవ‌కాశం ఎప్పుడు వ‌స్తుందో..?

More News

తండ్రితో కలసి నటిస్తున్నఎన్టీఆర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్..ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్నారు.సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న నాన్నకు ప్రేమతో..సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయనున్నారు.

ప్రభాస్ న్యూమూవీ టైటిల్ వీరబలి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాహుబలి 2లో నటిస్తున్నారు. మరి..వీరబలి ఏమిటి..?

విక్రమ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

విక్రమ్...శంకర్ దర్శకత్వంలో నటించిన ఐ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమా కో్సం విక్రమ్ చాలా కష్టపడ్డాడు.

సక్సెస్ టూర్లో 'కంచె' టీమ్

వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన చిత్రం కంచె.ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా,నికేతన్ ధీర్ విలన్ గా నటించాడు.

'ఎక్స్ ప్రెస్ రాజా' ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్

''రన్ రాజా రన్''చిత్రం తరువాత యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ నటిస్తున్న చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా.