నిహారిక ఎంట్రీ పై వ‌రుణ్ తేజ్ కామెంట్..

  • IndiaGlitz, [Wednesday,October 21 2015]

మెగా ఫ్యామిలీ నుంచి నాగ‌బాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇస్తుంద‌నే వార్త అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది. నిహారిక ఎంట్రీ గురించి ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ ని అడిగితే... నాగ‌బాబు గారికి అభ్యంత‌రం లేక‌పోతే మాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని స్పందించాడు.

తాజాగా నిహారిక బ్ర‌ద‌ర్ వ‌రుణ్ తేజ్ ని ఇదే విష‌యం గురించి అడిగితే..నిహారిక హీరోయిన్ అవ్వ‌డ‌మ‌నేది స‌డ‌న్ గా తీసుకున్న నిర్ణ‌యం కాదు. ఈ విష‌యం పై ఎప్ప‌టి నుంచో ఫ్యామిలీలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మెగా ఇమేజ్ ద్రుష్టిలో పెట్టుకుని మేమంతా వ‌ద్ద‌నే అన్నాం. అయితే ఆఖ‌రికి..నిహారిక నిర్ణ‌యాన్ని మేమంతా మ‌న‌స్పూర్తిగా ఓకే చేసాం అని చెప్పాడు.