మిస్టర్ పై క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్..
Thursday, June 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం మిస్టర్. ఈ చిత్రానికి నల్లమలపు బుజ్జి నిర్మాత. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే స్పెయిన్ షెడ్యూల్ జరుగుతూ ఉండాలి. అయితే...ఏమైందో ఏమో కానీ...అనుకున్న డేట్ కి మిస్టర్ స్పెయిన్ షెడ్యూల్ ప్రారంభం కాలేదు.
ఇదిలా ఉంటే...వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. దీంతో వరుణ్ తేజ్, శ్రీను వైట్ల సినిమా మిస్టర్ ఆగిపోయింది అంటూ ప్రచారం ప్రారంభమైంది. ఈ ప్రచారానికి ఫుల్ స్టాఫ్ పెట్టేలా వరుణ్ తేజ్ ట్విట్టర్ లో స్పందిస్తూ...శ్రీను వైట్ల గారితో చేయనున్న సినిమా ఈనెల 27 నుంచి సెట్స్ పైకి వెళుతుంది. ఈ నెల 27న స్పెయిన్ లో షూటింగ్ చేయనున్నాం అని తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments