కొందరు యోధులు తయారవుతారు.. కానీ ‘‘గనీ’’ యోధుడిగా పుట్టాడు
Send us your feedback to audioarticles@vaarta.com
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. లవ్ స్టోరీలతో తనకు తిరుగులేదని నిరూపించుకున్న ఆయన.. యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. తాజాగా వరుణ్ తేజ్ నటిస్తోన్న సినిమా ‘‘గని’’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘‘గని’’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మూడు పాటలను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇక ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో గనీ నుంచి చిన్న టీజర్ వదిలారు. ఇందులో ఆయనను చాలా పవర్ ఫుల్ గా చూపించారు. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి.. వరుణ్‌కి ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా కనిపించారు. కొంతమంది యోధులుగా తయారవుతారు కానీ 'గని' యోధుడిగా పుట్టాడు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఇకపోతే ‘‘గనీ’’లో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ-సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈపాటికే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సి వుంది. అయితే కోవిడ్, ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా విడుదల వాయిదా పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com