డిసెంబర్ 21న వరుణ్ తేజ్ అంతరిక్షం 9000 KMPH
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తొలి తెలుగు స్పేస్ థ్రిల్లర్ టైటిల్ ప్లస్ ఫస్ట్ లుక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డుదలైంది. ఈ చిత్రానికి అంతరిక్షం 9000 KMPH టైటిల్ ఖరారు చేసారు. ఇందులో వరుణ్ తేజ్ వ్యోమగామిగా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదు. హాలీవుడ్ లోనే ఎక్కువగా వచ్చే స్పేస్ కాన్సెప్టులను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈయన గతేడాది ఘాజీ సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్నాడు. మరోసారి కొత్తగా ప్రయత్నిస్తూ.. అంతరిక్షం 9000 KMPH సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
హాలీవుడ్ సినిమా గ్రావిటీ తరహాలోనే.. అంతరిక్షం 9000 KMPH సినిమాను కూడా జీరో గ్రావిటీ సెట్స్ లో చిత్రీకరించాడు దర్శకుడు. దీనికోసం హీరో వరుణ్ తేజ్ కూడా కజకిస్థాన్ వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని వచ్చారు. ఈ చిత్రం కోసం హాలీవుడ్ నుంచి ఓ టీంను తీసుకొచ్చాడు దర్శకుడు సంకల్ప్. వాళ్ల ఆధ్వర్యంలోనే అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసారు. అదితిరావ్ హైద్రీ, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ తో కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న అంతరిక్షం 9000 KMPH విడుదల కానుంది.
నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావ్ హైద్రీ, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com